హీరోలతో పనిలేదు.. ఇప్పుడు ‘స్టార్ డైరెక్టర్ల’ పేరే సినిమాకు అతిపెద్ద బ్రాండ్!
సినిమా అంటే ఒకప్పుడు కేవలం హీరో పేరు మీదే నడిచేది. పోస్టర్ మీద హీరో బొమ్మ ఉంటే చాలు కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు గేమ్ మారింది. ప్రేక్షకులు హీరోను చూసి థియేటర్లకు రావడం లేదు.. “దర్శకుడు ఎవరు?” అని చూస్తున్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడు ‘స్టార్ హీరోల’ కంటే ‘స్టార్ డైరెక్టర్ల’ క్రేజ్ పీక్స్‌కి చేరింది.
డైరెక్టరే బాక్సాఫీస్ కింగ్: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దారిలో ఇప్పుడు చాలా మంది దర్శకులు బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. లోకేష్ కనగరాజ్ పేరు మీద LCU యూనివర్స్ అని జనాలు ఎగబడుతున్నారు. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) “యానిమల్” తీస్తే బాలీవుడ్ మొత్తం షేక్ అయింది. ప్రశాంత్ నీల్ యాక్షన్ తీస్తే హీరో ఎవరైనా సరే వందల కోట్లు ఖాయం. అట్లీ, సుకుమార్ లాంటి డైరెక్టర్ల కోసం హీరోలు ఏళ్ల తరబడి వెయిట్ చేస్తున్నారు.అలాగే అనీల్ రావిపూడి తక్కువ టైమ్ లో తక్కువ బడ్జెట్ లో కామిడీ మిక్స్ చేసి యంగ్ మరియు సీనియర్ హీరోలతో సంవత్సరానికి ఒక సినిమా తీస్తూ గ్యారంటీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకొని నిర్మాతలకు కురిపిస్తూ సినిమాలు కు పెట్టిన దానికి రెట్టింపు లాబాలతో దూసుకెళ్తున్నాడు
పారితోషికాలు కూడా అదే రేంజ్‌లో.. ఈ దర్శకులు తీసుకునే పారితోషికాలు సైతం హీరోలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. ఒక్కో సినిమాకు రూ. 50 కోట్లు నుంచి రూ. 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ లేదా లాభాల్లో వాటా (Profit Share) తీసుకుంటున్నారు. ఒక సినిమాను ప్రమోట్ చేయాలంటే హీరో కంటే ముందు దర్శకుడే ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. డైరెక్టర్ బ్రాండ్ వాల్యూ పెరగడం అనేది ఇండియన్ సినిమాకు పట్టిన ఒక పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చు.
ఈ డైరెక్టర్లల్లో మీకు ఏ డైరెక్టర్ సినిమాలు అంటే ఇష్టం కామెంట్స్ లో మాతో పంచుకోండి.
