చెప్పిన దానికంటే ఎక్కువే చూపించారు”.. తన బయోపిక్ మూవీపై గరివిడి లక్ష్మి కామెంట్స్!
ఒక సాధారణ మహిళ జీవిత ప్రయాణాన్ని, ఆమె కష్టాలను సినిమాగా తీస్తే అది ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. సరిగ్గా అలాంటి స్ఫూర్తిదాయకమైన మహిళ గరివిడి లక్ష్మి. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ సినిమాపై లక్ష్మి గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. డైరెక్టర్ గౌర నాయుడు (Gowra Naidu) తన బయోపిక్ తీస్తానని వచ్చినప్పుడు ఆమె స్పందన ఎలా ఉంది, సినిమా చూసిన తర్వాత ఆమె ఎలా ఫీల్ అయ్యారో ఇప్పుడు చూద్దాం.
మొదట్లో ఎందుకు ఒప్పుకోలేదు? డైరెక్టర్ గౌర నాయుడు గారు తన బయోపిక్ తీస్తానని మొదటిసారి చెప్పినప్పుడు, లక్ష్మి గారు చాలా రోజులు ఒప్పుకోలేదట. “నా జీవితంలో జరిగిన కష్టాలు, ఆ బాధలు అన్నీ మళ్ళీ తెరపై చూస్తే తట్టుకోలేనేమో అని భయపడ్డాను. నా జీవితం సినిమాగా మారడం అవసరమా అని ఆలోచించాను” అని ఆమె తెలిపారు.
డైరెక్టర్ మాట నిలబెట్టుకున్నారు తన కష్టాలను, ఆవేదనను అర్థం చేసుకున్న డైరెక్టర్, ఆమెను ఎలాగైనా ఒప్పించాలనుకున్నారు. పదిసార్లు ఫోన్లు చేసి, తాను రాసిన బుర్రకథలను, కొన్ని సన్నివేశాలను వినిపించి ఆమెకు నమ్మకం కలిగించారు. “నువ్వు బాధపడకు, నిన్ను ఎక్కడికో తీసుకెళ్తాను అని ఆయన చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే నన్ను గొప్పగా చూపించారు” అని లక్ష్మి గారు సంతోషం వ్యక్తం చేశారు.
చెప్పిన దానికంటే ఎక్కువే చేశారు సినిమా పూర్తయ్యాక చూసిన తర్వాత తన రియాక్షన్ ఏంటని అడిగితే.. “ఆయన నాకు చెప్పిన దానికంటే ఎక్కువే చేసి చూపించారు. నా బుర్రకథలో నేను చేయలేకపోయినవి కూడా ఆయన ఈ సినిమాలో చేసి నన్ను ఎంతో గొప్పగా ఎదిగించారు” అని లక్ష్మి గారు భావోద్వేగానికి గురయ్యారు. ఒక డైరెక్టర్ పై ఉన్న నమ్మకం, ఒక మహిళ జీవిత పోరాటం వెండితెరపై ఎంత అద్భుతంగా ఆవిష్కృతమైందో ఈ మాటలు చెబుతున్నాయి.
ఈ మూవీ మీరు చూసారా మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి
