టాలీవుడ్‌లో ‘పార్ట్-2’ లొల్లి.. ఇది కథ డిమాండా? లేక కాసుల కోసమా?
ఒకప్పుడు సినిమా అంటే రెండున్నర గంటల్లో కథ మొత్తం పూర్తి కావాలి. కానీ ‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్‌లో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. అదే ‘పార్ట్-2’ వ్యాధి. రీసెంట్‌గా వస్తున్న ప్రతి పెద్ద సినిమా రెండు భాగాలుగానే ప్లాన్ చేస్తున్నారు. ‘పుష్ప’, ‘సలార్’, ‘కల్కి 2898 AD’, ‘దేవర’.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది. అసలు ఈ టూ-పార్ట్స్ (Two-Part Movies) ట్రెండ్ ఎందుకు వస్తోంది? నిజంగా కథకు అంత స్కోప్ ఉందా లేక బిజినెస్ స్ట్రాటజీనా?
సగం కథతో అసంతృప్తి: దర్శకులు ఒక భారీ ప్రపంచాన్ని క్రియేట్ చేసినప్పుడు, అందులోని పాత్రలను పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక భాగం సరిపోవడం లేదని చెబుతున్నారు. కానీ, ఫస్ట్ పార్ట్ చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడికి “సినిమా మధ్యలో ఆపేశారే” అనే అసంతృప్తి మిగిలిపోతోంది. క్లైమాక్స్‌లో ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి, అసలు మజా అంతా సెకండ్ పార్ట్‌లోనే అని చెప్పి పంపించేస్తున్నారు.
నిర్మాతల బిజినెస్ మాస్టర్ ప్లాన్: దీని వెనుక ఉన్న అసలు కారణం కాసులు (Business). ఒకే సెట్‌లో, ఒకే హీరో డేట్స్‌తో సినిమాను రెండు భాగాలుగా తీస్తే.. నిర్మాణ వ్యయం చాలా వరకు కలిసొస్తుంది. పైగా ఫస్ట్ పార్ట్ హిట్ అయితే, సెకండ్ పార్ట్ మీద ఆటోమేటిక్‌గా వంద రెట్లు హైప్ వస్తుంది. అప్పుడు థియేట్రికల్, డిజిటల్ రైట్స్ రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నమాట. అయితే, ఈ సీక్వెల్స్ మోజులో ఫస్ట్ పార్ట్ కంటెంట్‌ను నీరుగార్చకుండా ఉంటేనే ఈ ట్రెండ్ సక్సెస్ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
మరి దీని పై మీరేమంటారు పార్ట్ 2 అవసరమేన లేకపోతే ఒక్క పార్ట్ లోనే మూడు గంటల పైన సినిమా ఉంటే చూస్తారా కామెంట్స్ లో మాతో పంచుకోండి
