“నేను మారను.. వాళ్లే మారాలి”: విజయ్ దేవరకొండ మాస్ వార్నింగ్.. ఇంతకీ టార్గెట్ చేసింది ఎవరిని?
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అంటేనే ఒక సెన్సేషన్. ఆయన యాటిట్యూడ్, మాట్లాడే తీరుకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో.. అదే స్థాయిలో ఆ యాటిట్యూడ్‌ను ‘బలుపు’ అని విమర్శించే హేటర్స్ కూడా ఉన్నారు. గత కొంతకాలంగా తన సినిమాల రిజల్ట్స్‌తో సంబంధం లేకుండా ఇంటర్నెట్లో తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్న విజయ్.. తాజాగా ఒక ఈవెంట్లో తన హేటర్స్‌పై అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ఎవరి పేరు ప్రస్తావించకుండానే తనదైన స్టైల్లో మాస్ వార్నింగ్ ఇచ్చాడు.
విజయ్ దేవరకొండ స్పీచ్‌లో ఏమన్నాడంటే.. వేదికపై మైక్ అందుకున్న విజయ్ చాలా ఎమోషనల్ అండ్ అగ్రెసివ్ టోన్‌లో మాట్లాడుతూ.. “నా కలలు, నా శ్రమ వానికి అనవసరం అనిపిస్తే నేను ఆగాలా? నా నిజాయితీ, నా ఆనెస్టీ వానికి ఆరోగాన్స్ లా (పొగరు) అనిపిస్తే నేను నటించాలా? నా మీద నాకు ఉన్న నమ్మకం, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వానికి బలుపులా అనిపిస్తే నేను తగ్గాలా? ఇప్పుడు నా జర్నీ వానికి అరగకపోతే నేను ఇంట్లో కూర్చోవాలా?” అంటూ వరుస ప్రశ్నలతో వేదికను హోరెత్తించాడు.
చివరగా “నేను మారను.. వాళ్లే మారాలి” అంటూ విజయ్ ఇచ్చిన కంక్లూజన్‌కి ఫ్యాన్స్ నుంచి విజిల్స్ పడ్డాయి.
ఇంతకీ విజయ్ టార్గెట్ చేసింది ఎవరిని? ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అసలు విజయ్ “వాడు” అని ఎవరిని ఉద్దేశించి అన్నాడు? దీనిపై సినీ వర్గాల్లో పలు ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి.
- యాంటీ ఫ్యాన్స్ & ట్రోలర్స్: విజయ్ ఎదుగుదలను జీర్ణించుకోలేక, పదే పదే అతని యాటిట్యూడ్‌ను ‘ఆరోగాన్స్’ అంటూ నెగెటివ్ ట్రెండ్స్ చేసే సోషల్ మీడియా ట్రోలర్స్‌ను ఉద్దేశించే విజయ్ ఈ మాటలు అన్నాడని కొందరు భావిస్తున్నారు.
- స్పెసిఫిక్ రివ్యూవర్స్: గత రెండు మూడు సినిమాల రిలీజ్ సమయంలో కొందరు రివ్యూవర్స్ కావాలనే విజయ్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వీడియోలు చేశారు. వాళ్లకే ఈ కౌంటర్ పడిందని మరికొందరి వాదన.
- బాలీవుడ్ మీడియా: ‘లైగర్’ టైమ్ నుంచి విజయ్ కాన్ఫిడెన్స్‌ను ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ కొన్ని బాలీవుడ్ మీడియా సంస్థలు రాసిన కథనాలకు ఇది ఒక స్ట్రాంగ్ రిప్లై అని చెప్పొచ్చు.
పేరు ఎవరిదైనా కావొచ్చు కానీ.. తన కష్టాన్ని, తన ఆనెస్టీని విమర్శించే వాళ్ల కోసం తాను మారే ప్రసక్తే లేదని విజయ్ తేల్చి చెప్పేశాడు. చాలా గ్యాప్ తర్వాత పాత ‘రౌడీ’ని మళ్లీ చూశామంటూ ఈ వీడియోను ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ చేస్తున్నారు.
దీనిపై మీరేమంటారు కింద కామెంట్ చేయండి.
