ప్రాణాలు పణంగా పెట్టి తీసిన సీన్.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ షూటింగ్లో భయపెట్టే సంఘటన, వీడియో వైరల్!
సినిమాయే ప్రాణం.. రిస్క్ చేసి మరీ నటీనటుల డెడికేషన్ మనం థియేటర్లో రెండున్నర గంటల పాటు సినిమా చూసి ఎంజాయ్ చేస్తాం కానీ, ఆ రెండున్నర గంటల వినోదం వెనుక వందల మంది ప్రాణాలు పణంగా పెట్టి చేసే శ్రమ ఉంటుంది. కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా షూటింగ్ పూర్తి చేస్తారు. తాజాగా శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ (Comrade Kalyan) మూవీ సెట్స్‌లో జరిగిన అలాంటి ఒక భయపెట్టే సంఘటనకు సంబంధించిన వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ఆనందంలో, ఆ విజయం వెనుక ఉన్న కష్టాన్ని తెలియజేస్తూ వారు ఎమోషనల్ అయ్యారు.
మంగళూరు అడవుల్లో ఆ రోజు అసలేం జరిగింది? కోన వెంకట్ షేర్ చేసిన బిహైండ్ ది సీన్స్ (BTS) వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సంఘటన 2025 ఫిబ్రవరిలో మంగళూరు అడవుల్లో (Mangalore Forest) జరిగింది. నక్సల్స్ మరియు పోలీసుల గెటప్స్‌లో ఉన్న నటీనటులతో అడవిలోని ఒక పాత వంతెనపై కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో ఒక నటుడు గన్ ఫైర్ చేయగా.. ఊహించని విధంగా పెద్ద శబ్దం రావడంతో పాటు మరో నటుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో షాక్‌కు గురైన చిత్రయూనిట్ అంతా ప్రాణభయంతో పరుగులు తీస్తూ వంతెనపైకి వెళ్లి అతన్ని పట్టుకునే దృశ్యాలు ఆ వీడియోలో రికార్డ్ అయ్యాయి. యాక్టర్స్ ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో నటిస్తారో ఈ వీడియో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. కోన వెంకట్ అని అన్నారు
ఆడియన్స్ ఇచ్చే బ్లాక్‌బస్టర్ ఒక పునర్జన్మ! ఈ వీడియోను షేర్ చేస్తూ మేకర్స్ ఎంతో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “ప్రాణాలు పణంగా పెట్టి మా యాక్టర్స్ చేస్తారు.. సినిమాయే ప్రాణంగా మేమంతా బతుకుతాం.. ఆ సినిమా చూసి మీరు ఎంజాయ్ చేసి బ్లాక్‌బస్టర్ చేస్తే అదో పునర్జన్మ లా అనిపిస్తుంది” అంటూ తమ మనసులోని మాటను పంచుకున్నారు. ఈ బ్లాక్‌బస్టర్ విజయంతో తమ డైరెక్టర్ శ్రీకాంత్‌కు, అలాగే తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చారని, లవ్ యూ ఆడియన్స్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీవిష్ణు టాలెంట్ మరియు టీమ్ అంతా పెట్టిన ఎఫర్ట్స్ వల్లే ‘కామ్రేడ్ కళ్యాణ్’ థియేటర్లలో ఈ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
మీరు మూవీ చూసారా మీకు ఎలా అనిపించింది కిందహ కామెంట్ చేయండి
