రక్తం మరకలతో రష్మిక.. విజయ్ దేవరకొండ క్యూట్ పోస్ట్ వైరల్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ దక్కింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మైసా’ (Mysaa) నుంచి మేకర్స్ ఒక పవర్ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ముఖంపై రక్తం మరకలతో, ఎంతో ఇంటెన్స్ లుక్‌తో ఉన్న రష్మికను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పటివరకు గ్లామరస్ రోల్స్ తో మెప్పించిన రష్మిక, ఈ సినిమాలో ఒక వైలెంట్ అండ్ యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్లో కనిపించబోతోందని ఈ పోస్టర్ ద్వారా స్పష్టమవుతోంది.
ఇదిలా ఉంటే, ఈ బర్త్‌డే పోస్టర్‌కి మించి సోషల్ మీడియాలో మరో విషయం తెగ ట్రెండ్ అవుతోంది. అదే విజయ్ దేవరకొండ చేసిన బర్త్‌డే విష్! రష్మికకు శుభాకాంక్షలు చెబుతూ.. “హ్యాపీ బర్త్‌డే.. ఐ లవ్ యూ జయమ్మ” అంటూ విజయ్ చేసిన పోస్ట్ నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ క్యూట్ విష్ చూసిన ఫ్యాన్స్ లైక్స్, కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. మొత్తానికి అటు ‘మైసా’ పోస్టర్, ఇటు రౌడీ బాయ్ విష్ తో ఇవాళ సోషల్ మీడియా మొత్తం రష్మిక నామస్మరణతో మార్మోగిపోతోంది.
