Movie News

టాలీవుడ్‌లో ‘పెద్ది’ టెన్షన్.. రిలీజ్ డేట్‌పై కన్ఫ్యూజన్,

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘పెద్ది’ (Peddi) సినిమా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక పక్క సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటే, అయితే ఎప్పటి నుండో ఈ సినిమా ఏప్రిల్ 30 నే వస్తుంది అని చిత్ర బృందం చెప్పుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు మరోపక్క రిలీజ్ డేట్ విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్ ఇతర నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ‘పెద్ది’ రిలీజ్ డేట్ ఎప్పుడనేది ఇంకా అధికారికంగా ఫైనల్ కాకపోవడంతో.. అదే సమయంలో తమ సినిమాలను రిలీజ్ చేద్దామనుకున్న దిల్ రాజు, సమంత లాంటి స్టార్స్ తమ ప్రాజెక్ట్స్ ను వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్ టాక్.

ఇదిలా ఉంటే, ఈ సినిమా బిజినెస్ లెక్కలు చూసి ట్రేడ్ వర్గాలు సైతం విస్మయానికి గురవుతున్నాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం, ‘పెద్ది’ నైజాం ఏరియా థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ ఏకంగా రూ. 63 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నైజాం ఏరియాలో ఒక సినిమాకి ఈ రేంజ్ బిజినెస్ జరగడం ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్. ఈ డీల్ తో ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సృష్టించబోయే సునామీ ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *