‘పెద్ది’ వీకెండ్ ర్యాంపేజ్: 3 రోజుల్లోనే రూ. 236.7 కోట్లు.. బాక్సాఫీస్ ఛాంపియన్‌గా రామ్ చరణ్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పల్లెటూరి పహిల్వాన్‌గా అదరగొట్టిన చిత్రం ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మిక్స్డ్ టాక్‌ను సైతం పక్కకు నెట్టి, కేవలం చరణ్ మాస్ ఇమేజ్ తో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా 3 రోజుల (ఫస్ట్ వీకెండ్) అఫీషియల్ కలెక్షన్స్ పోస్టర్‌ను విడుదల చేశారు.
3 రోజుల్లో రూ. 236.7 కోట్ల సునామీ! అధికారిక లెక్కల ప్రకారం.. ‘పెద్ది’ సినిమా మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 236.7 కోట్ల గ్రాస్ (236.7 CR+ Gross Worldwide) వసూలు చేసి ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ గా నిలిచింది.
- మొదటి రోజు: రూ. 135.36 కోట్లు
- రెండవ రోజు: రూ. 46.44 కోట్లు (మొత్తం 181.8 కోట్లు)
- మూడవ రోజు: రూ. 54.9 కోట్లు
రెండవ రోజు (వర్కింగ్ డే) తో పోలిస్తే, మూడవ రోజు శనివారం (వీకెండ్) కావడంతో కలెక్షన్స్ లో మళ్లీ మంచి జంప్ కనిపించింది. దాదాపు 55 కోట్ల గ్రాస్ రాబట్టడం అంటే మాస్ సెంటర్స్ లో రామ్ చరణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
హాఫ్ సెంచరీ మార్క్ దిశగా.. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన క్రికెట్, కుస్తీ ఎపిసోడ్స్ బి, సి సెంటర్ల (B & C Centers) ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వీకెండ్ కావడంతో థియేటర్ల వైపు క్యూ కట్టారు. ఈరోజు ఆదివారం (Day 4) హాలిడే అడ్వాంటేజ్ కూడా తోడైతే, ఫస్ట్ లాంగ్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా ఈజీగా రూ. 280 కోట్ల నుంచి రూ. 300 కోట్ల మార్క్‌ను టచ్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.
సోమవారం (మండే టెస్ట్) నాడు బుకింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దానిపైనే ఈ సినిమా ఫుల్ రన్ మరియు బ్రేక్ ఈవెన్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు!
మీకు ఎలా అనిపించింది ఈ సినిమా కింద కామెంట్ చేయండి.
