Collections

‘పెద్ది’ బాక్సాఫీస్ ర్యాంపేజ్: 2 రోజుల్లో ఎన్ని కోట్లు వసూల్ చేసింది అంటే.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబోలో వచ్చిన ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. మొదటి రోజే రూ. 135.36 కోట్ల భారీ గ్రాస్ తో రికార్డులు క్రియేట్ చేసిన ఈ పక్కా రూరల్ మాస్ ఎంటర్టైనర్, రెండవ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ ను చూపించింది.

2 రోజుల్లో 180 కోట్ల మార్క్ క్రాస్! తాజాగా మేకర్స్ అధికారికంగా విడుదల చేసిన పోస్టర్ ప్రకారం, ‘పెద్ది’ సినిమా మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 181.8 కోట్ల గ్రాస్ (181.8 CR+ Gross Worldwide) వసూలు చేసి ‘బాక్సాఫీస్ ఛాంపియన్’గా దూసుకుపోతోంది. మొదటి రోజు 135 కోట్లు రాగా.. రెండవ రోజు (వర్కింగ్ డే అయినప్పటికీ) ఈ సినిమా దాదాపు రూ. 46.44 కోట్ల భారీ గ్రాస్ ను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

వీకెండ్ లో అసలు రచ్చ షురూ! మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఇంత స్ట్రాంగ్ గా నిలబడటం కేవలం రామ్ చరణ్ మాస్ ఇమేజ్, స్టార్ డమ్ వల్లే సాధ్యమైందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ కలెక్షన్స్ చూస్తుంటే మాస్ సెంటర్స్, సింగిల్ స్క్రీన్స్‌లో ‘పెద్ది’ పహిల్వాన్ ఫీవర్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈరోజు (శనివారం), రేపు (ఆదివారం) వీకెండ్ సెలవులు కాబట్టి కలెక్షన్స్ మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా ఈజీగా 250 నుంచి 300 కోట్ల మార్క్‌ను టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

సెకండ్ హాఫ్‌లో కాస్త లాగ్ ఉన్నా సరే, చరణ్ యాక్టింగ్, క్రికెట్-కుస్తీ ఎపిసోడ్స్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తున్నాయి. మరి ఈ వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ ట్రెండ్ ఎలా ఉండబోతుందో చూడాలి!

మరి మీరు చూశారా పెద్ది మూవీ మీకు ఎలా అనిపించింది కిందా కామెంట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *