Reviews

‘ది ప్యారడైజ్’ మూవీ రివ్యూ: అంచనాలు తలకిందులు..ఎక్కడ మిస్ ఫైర్ అయింది అంటే.

నటీనటులు: నాని, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు

దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల

సంగీతం: అనిరుధ్ రవిచందర్

సినీ దావత్ రేటింగ్: 2.5/5

‘దసరా’ లాంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని (Nani), డైనమిక్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise). కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండా డైరెక్టర్ చూపించిన ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ఎన్నో ఊహించుకున్నారు. కానీ, థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఆ హైప్‌లో 1 శాతం కూడా మ్యాచ్ చేయలేక తీవ్రంగా నిరాశపరిచింది.

కథనం – విశ్లేషణ: రక్తపాతం తప్ప ఎమోషన్ లేదు! ‘దసరా’ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం అందులో ఉన్న బలమైన ‘కోర్ ఎమోషన్’. కానీ ‘ది ప్యారడైజ్’లో అదే పూర్తిగా మిస్సయింది. వంద సినిమాలను మిక్సీలో వేసి కొట్టినట్టుగా ఈ సినిమా కథనం సాగుతుంది. ఒక సరైన కన్వీనియంట్ స్క్రీన్‌ప్లే ఎక్కడా కనిపించదు. సడెన్‌గా గన్స్ వస్తాయి, సడెన్‌గా ఫైట్స్ జరుగుతాయి. కేవలం రక్తపాతం (Bloodbath) చూపించడంపై పెట్టిన ఫోకస్ డైరెక్టర్ ఎమోషన్స్ పైన పెట్టలేదు.

నటీనటుల పర్ఫార్మెన్స్: క్యారెక్టర్స్ వేస్ట్! సినిమా కోసం నాని జడలు వేసుకుని, గెటప్ కోసం పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు లాంటి వాళ్లను పెట్టుకుని డైరెక్టర్ కనీసం వాళ్ల క్యారెక్టర్లను సరిగ్గా వాడుకోలేకపోయాడు. నిజం చెప్పాలంటే రాఘవ్ జుయల్ సినిమాలో కంటే ప్రీ-రిలీజ్ ఈవెంట్లో చేసిన రచ్చే బాగుందనిపిస్తుంది. ఇక నాని తల్లిగా నటించిన ఆవిడ పర్ఫార్మెన్స్ బాగున్నా, సరైన స్క్రీన్‌ప్లే లేకపోవడం వల్ల ఆ క్యారెక్టర్ కూడా సినిమాను కాపాడలేకపోయింది.

సాంకేతిక వర్గం: బిజిఎమ్ కూడా వర్కౌట్ కాలేదు! ఎలాంటి ఫ్లాప్ సినిమాకైనా తన మ్యూజిక్‌తో ప్రాణం పోసే అనిరుధ్ (Anirudh) బిజిఎమ్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది. స్క్రీన్‌ప్లే వీక్‌గా ఉన్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత కొట్టినా లాభం లేదని ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఇక ‘యశోదానగర్ కట్ట మీద’, ‘ప్యారడైజ్’ మెయిన్ సాంగ్ విజువల్‌గా ఆకట్టుకోకపోగా.. థియేటర్లలో ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి.

మెగా ఫ్యాన్స్‌లో టెన్షన్.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన తదుపరి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘ది ప్యారడైజ్’ రిజల్ట్ మరియు ఆయన డైరెక్షన్ డీలింగ్ చూశాక ఇప్పుడు మెగా అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.

సినీ దావత్ ఫైనల్ తీర్పు: పేరుకే ఇది ‘ది ప్యారడైజ్’ కానీ థియేటర్‌లో మాత్రం ప్రేక్షకులకు నరకం చూపిస్తుంది. దర్శకుడి ఓవర్ కాన్ఫిడెన్స్ సినిమా కొంపముంచింది.మరి మీరు చూసారా మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి.

(గమనిక: సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా పైరసీని మాత్రం ప్రోత్సహించకండి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *