Movie News

“సీక్వెల్స్ లేవు.. ఇది ఒకే ఒక్క బుల్లెట్”: ‘ది ప్యారడైజ్’ పై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!

‘దసరా’ లాంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని (Nani), డైనమిక్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా విశేషాలపై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో తన మాటల ద్వారా గూస్‌బంప్స్ తెప్పించారు డైరెక్టర్. ఆయన పంచుకున్న కీలక విషయాలు మీకోసం..

సీక్వెల్స్ లేవు.. ఒకే ఒక్క బుల్లెట్! ప్రస్తుతం ఎక్కడ చూసినా పార్ట్-1, పార్ట్-2 ట్రెండ్ నడుస్తోంది. దీనిపై క్లారిటీ ఇస్తూ.. “‘ది ప్యారడైజ్’కు రెండు పార్టులు, సీక్వెల్స్ లాంటివి ఏమీ లేవు… ఇది ఒకే ఒక్క బుల్లెట్. నా డిక్షనరీలో రీషూట్ అనే ముచ్చటే లేదు. షాట్ పర్ఫెక్ట్‌గా వచ్చేదాకా వంద సార్లయినా తీస్తాను. మనసుకు నచ్చని పని నేను చేయను, అందుకే ట్రైలర్ కట్ చేసి హడావిడిగా వదలడానికి టైమ్ లేదు” అని శ్రీకాంత్ ఓదెల కుండబద్దలు కొట్టారు.

నాని కెరీర్‌లోనే అత్యంత కఠినమైన కష్టం ఈ సినిమా కోసం నాని పడ్డ కష్టం గురించి చెబుతూ.. “నాని అన్న 18 ఏళ్ల కెరీర్‌లో పడ్డ అత్యంత కఠినమైన కష్టం ఈ ‘ది ప్యారడైజ్’. సెట్స్‌లో తన ప్రాణం పెట్టేశాడు. ఏకంగా 171 రోజుల పాటు షూటింగ్ చేశాం. అసలైన తిరుగుబాటు కనిపించాలంటే ఆ కష్టం పడాల్సిందే. ప్రతీ సీన్‌లో వందల మంది జనం కనిపిస్తారు” అని ఆయన తెలిపారు.

యాక్షన్ కాదు.. ఎమోషన్ గుండెల్ని పిండేస్తుంది! సినిమా స్టోరీ బ్యాక్‌డ్రాప్ గురించి రివీల్ చేస్తూ.. “ఆదిలాబాద్‌లోని రియల్ ఇన్సిడెంట్స్ మరియు సికింద్రాబాద్ బస్తీ లైఫ్.. ఈ రెండింటినీ కలిపి ఒక విప్లవాన్ని సృష్టించా! ఇందులో 4 భారీ యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి. సినిమా మొదలైనప్పుడు ఇది యాక్షన్ మూవీ అనుకుంటారు.. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి నాని అన్న ఎమోషన్ మీ గుండెల్ని పిండేస్తుంది. థియేటర్ నుంచి బయటకొచ్చేటప్పుడు యాక్షన్ కాదు.. ఎమోషనే రక్తాన్ని మరిగిస్తుంది” అని శ్రీకాంత్ కాన్ఫిడెంట్‌గా చెప్పారు.

మోహన్ బాబుతో ఫేస్-ఆఫ్.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం ఇక ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మెయిన్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్ర గురించి చెబుతూ.. “మోహన్ బాబు గారితో నాని ఫేస్-ఆఫ్ సీన్స్ చూస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇచ్చే సౌండ్ కిక్‌కి థియేటర్లలో రచ్చ లేచిపోవాల్సిందే. సినిమాలో మొత్తం 6 పాటలు ఉంటాయి” అని వివరించారు.

టీజర్‌లో నాని చెప్పిన ఫాస్ట్ డైలాగ్‌లను విమర్శించిన వాళ్లకు థియేటర్లలో సీన్ ఫ్లో చూశాక మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయమని శ్రీకాంత్ ఓదెల సవాల్ విసిరారు. దీన్ని బట్టి చూస్తుంటే ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ రికార్డులను తిరగరాయడం పక్కా అనిపిస్తోంది.

మరి మీకు ఎలా అననిపిస్తుంది కింద కామెంట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *