Movie News

హీరోల కంటే వీళ్లకే క్రేజ్.. BGM తో బ్లాక్ బస్టర్స్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు!

సినిమాలో సీన్ ఎంత సాదాసీదాగా ఉన్నా.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) తో గూస్‌బంప్స్ తెప్పించడం ఈతరం మ్యూజిక్ డైరెక్టర్ల స్టైల్. ఒకప్పుడు పాటలు బాగుంటే ఆడియో హిట్ అనేవాళ్లు. ఇప్పుడు బిజిఎం (Background Score) బాగుంటేనే సినిమా హిట్ అవుతోంది. సినిమా రాతను మార్చేస్తున్న ఆ మ్యూజిక్ సెన్సేషన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

అనిరుధ్, థమన్, దేవి శ్రీ.. ఈ త్రయమే టాప్! కోలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్‌ను శాసిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్ (Anirudh). ‘జైలర్’, ‘విక్రమ్’, ‘దేవర’ సినిమాలకు ఆయన ఇచ్చిన BGM థియేటర్లలో స్పీకర్లు బద్దలుకొట్టింది. హీరోల ఎలివేషన్ సీన్లకు అనిరుధ్ మ్యూజిక్ పడితే అదొక పూనకాల జాతర. మరోపక్క మన థమన్ (Thaman) కూడా ‘అఖండ’, ‘గుంటూరు కారం’ OG లాంటి సినిమాలతో తన మార్క్ చూపించాడు. అలాగే పుష్ప ,తండేల్ ,ఉస్తాద్ బగత్ సింగ్ ఇలా మోషనల్ అండ్ మాస్ ఎలివేషన్లలో దేవి శ్రీ ప్రసాద్ (DSP) దే పైచేయి.

కలసి వస్తున్న మలయాళ మ్యూజిక్: వీరితో పాటు సుశిన్ శ్యామ్ (‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేమ్), సంతోష్ నారాయణన్ లాంటి వాళ్లు కూడా ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ల కోసం ఇప్పుడు నిర్మాతలు హీరోలకు ఇచ్చినంత పారితోషికం ఇస్తున్నారు. డైరెక్టర్లు వీళ్ల డేట్స్ కోసమే ఆరు నెలలు వెయిట్ చేస్తున్నారు. విజువల్స్ పీక్స్ లో ఉన్నా, దానికి ప్రాణం పోసేది మ్యూజిక్ డైరెక్టర్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరి మీకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇష్టం.. ఎవరి సాంగ్స్ ఎక్కువ వింటారు కామెంట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *