Movie News

నవ్వులు ఏమాయె? టాలీవుడ్‌లో ‘ఫుల్ లెంగ్త్ కామెడీ’ సినిమాలు ఎందుకు రావడం లేదు?

ఒకప్పుడు ఈవీవీ సత్యనారాయణ, శ్రీను వైట్ల, జంధ్యాల గారి సినిమాలు వస్తున్నాయంటే థియేటర్లలో నవ్వుల పండగే. ఎవడి గోల వాడిధి, ‘వెంకీ’, ‘ఢీ’, ‘ఖలేజా’, ‘కిక్’ లాంటి సినిమాలు టీవీలో వస్తే ఇప్పటికీ కదలకుండా చూసేవాళ్లు ఉన్నారు. కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో ఆ నవ్వులు కరువయ్యాయి. అసలు ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్లు ఎందుకు రావడం లేదు?

బ్లడ్, యాక్షన్, వయలెన్స్.. ఇదే ట్రెండ్: ‘కేజీఎఫ్’, ‘యానిమల్’ లాంటి సినిమాలు ఇచ్చిన ఇంపాక్ట్ వల్ల దర్శకులు, నిర్మాతలు మొత్తం యాక్షన్, డార్క్ థ్రిల్లర్స్, మరియు పాన్-ఇండియా సబ్జెక్ట్స్ వైపు వెళ్లిపోయారు. రక్తపాతం, తుపాకులు ఉంటేనే సినిమా ఆడుతుందనే భ్రమలో ఇండస్ట్రీ ఉంది. కామెడీ సినిమాలు తీస్తే అవి కేవలం ఓటీటీకి మాత్రమే పనికొస్తాయి, జనాలు థియేటర్లకు రారు అనే ఫిక్స్‌డ్ మైండ్‌సెట్‌కి వచ్చేసారు.

రచయితల కొరత: క్లీన్ కామెడీ రాయడం అనేది ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పని. కడుపుబ్బా నవ్వించే డైలాగ్స్ రాయగలిగిన రైటర్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. త్రివిక్రమ్ లాంటి వారు సీరియస్ కథల వైపు వెళ్లగా.. కొత్త డైరెక్టర్లు ఎక్కువగా క్రైమ్, ఇన్వెస్టిగేషన్ మీద ఫోకస్ పెడుతున్నారు. ఇక ఉన్న డైరెక్టర్ ఒక అనీల్ రవిపూడి అలాగే కొత్తగా రామ్ అబ్బరాజు కూడా కామిడీ బాగానే పండిస్తున్నాడు. అయితే “నవ్వించడం మర్చిపోయిన ఇండస్ట్రీ ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటుంది” అని సినీ పెద్దలు హెచ్చరిస్తున్నారు. మళ్లీ కామెడీ ట్రాక్స్ బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది.

చూడాలి మరి మళ్ళీ కామిడీ సినిమాలు ఎప్పుడు వస్తాయో సొ అధి మాటర్ మరి మీకు ఏ డైరెక్టర్ అంటే ఇష్టం కొమెంట్స్ లో మాతో పంచుకోండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *