ట్విట్టర్(X) ‘ఫస్ట్ డే – ఫస్ట్ షో’ రివ్యూస్: నిర్మాతలకు లాభమా? శాపమా?
ఒకప్పుడు సినిమా రిజల్ట్ తెలియాలంటే శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయం పేపర్లో రివ్యూ వచ్చే వరకు ఆగాల్సిందే. కానీ ఇప్పుడు యుగం మారింది. సినిమా ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయితే, 6:30 కల్లా ట్విట్టర్ (X) లో రివ్యూలు ప్రత్యక్షం అయిపోతున్నాయి. ఒక చిన్న సీన్ బోర్ కొట్టినా సరే నెగెటివ్ ట్వీట్స్ (Disaster, Flop) తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.వాటితో పాటు యూట్యూబ్ చాన్నెల్స్ ధి కూడా అదే పరిస్థితి ఉంది
మౌత్ టాక్ vs సోషల్ మీడియా నెగెటివిటీ! ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో ట్విట్టర్ రివ్యూల వల్ల నిర్మాతలకు గుండె దడ పెరుగుతోంది. ఒక వర్గం కావాలనే పక్కా ప్లాన్‌తో (Negative PR) కొన్ని సినిమాలపై విషం చిమ్ముతోందని ఇండస్ట్రీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉదయం 9 గంటల షోకి వెళ్లే ప్రేక్షకుడికి, ఈ ట్విట్టర్ టాక్ చూసి మైండ్ బ్లాంక్ అయిపోయి, థియేటర్‌కు వెళ్లే ప్లాన్ క్యాన్సిల్ చేసుకుంటున్నాడు.
దీనివల్ల కోట్లు పెట్టి తీసిన సినిమాకు కనీసం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ కూడా రావడం లేదు. అయితే, సినిమా నిజంగా అద్భుతంగా ఉంటే మాత్రం ఇదే సోషల్ మీడియా ఆ సినిమాను ఆకాశానికి ఎత్తుతోంది. ఏదేమైనా, ఈ ఇన్స్టంట్ రివ్యూ కల్చర్ టాలీవుడ్ బాక్సాఫీస్ డైనమిక్స్‌ను దారుణంగా ప్రభావితం చేస్తోందనేది చేదు నిజం.
మరి ఇది సినిమా పరిశ్రమ కు ఎంతవరకు నష్టం కలిగిస్తాది అని మీరు బావిస్తున్నారు అనేది కింద కామెంట్స్ లో మాతో పంచుకోండి .
