మల్టీ-స్టారర్ గోల్డెన్ ఎరా: ఇగోలు పక్కన పెట్టి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న స్టార్స్!
చాలా కాలం పాటు టాలీవుడ్ అంటే ‘సోలో హీరోల’ అడ్డా. ఒక పెద్ద స్టార్ హీరో సినిమాలో, మరో హీరో చిన్న క్యామియో చేయడానికే ఇగో అడ్డొచ్చేది. “నా స్క్రీన్ స్పేస్ తగ్గిపోతుందేమో, నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమో” అని భయపడేవారు. కానీ, ఇప్పుడు ఆ మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయింది. ఇండియన్ సినిమా ఇప్పుడు మల్టీ-స్టారర్ల (Multi-starrers) స్వర్ణయుగంలోకి అడుగుపెట్టింది.
మార్కెట్ విస్తరణే అసలు లక్ష్యం! ఆర్ఆర్ఆర్ (రామ్ చరణ్, ఎన్టీఆర్) ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో ఇప్పుడు స్టార్లు తమ ఇగోలను పక్కన పెట్టారు. ‘కల్కి 2898 AD’లో ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్.. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.అలాగే సాలార్ లో పృథ్వీరాజ్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ‘వార్ 2’లో ఎన్టీఆర్ ఏకంగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో చేశాడు. మన శంకర వరప్రసాద్ లో చిరంజీవి తో వెంకటేష్ ఇవి కాకుండా నాని విజయ్ దేవరకొండ ఎవడే సుబ్రమణ్యం మూవీ ఎల్సీయూ (LCU) లాంటి సినిమాటిక్ యూనివర్స్‌లలో హీరోలంతా కలిసి నటిస్తున్నారు.అందులో బాగంగా నాగార్జున కూలి మూవీ రజిని కాంత్ తో నటించడం అలాగే కుబేరా లో దనుష్ తో కూడా నాగార్జునా నటించడం జరిగింధీ.
దీనివల్ల ఒక హీరో ఫ్యాన్స్, ఇంకో హీరో ఫ్యాన్స్ కలిసి థియేటర్లను నింపేస్తున్నారు. సినిమా బడ్జెట్ ఎంతైనా సరే, ఈజీగా రికవరీ అయిపోతోంది. రాబోయే పదేళ్లలో ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏలేది ఈ మల్టీ-స్టారర్ యూనివర్స్‌లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మరి దీని పై మీరేమంటారు ఇలా హీరోలు మల్టీస్టార్ మూవీ లు చేయడం మంచి పరిమాణం అంటారా కామెంట్స్ లో మాతో పంచుకోండి
