టాలీవుడ్‌లో ‘మైథాలజీ’ ఫీవర్.. పాన్ వరల్డ్ కొట్టాలంటే ఇదే సేఫ్ ఫార్ములానా?
ఒకప్పుడు టాలీవుడ్ అంటే ఫ్యాక్షన్, రొమాన్స్, లేదా పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్స్. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. మన దర్శకులు ఇప్పుడు హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో మన ఇతిహాసాలు, పురాణాల (Mythology) వైపు చూస్తున్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ‘మైథాలజీ + సైన్స్ ఫిక్షన్’ ఫీవర్ నడుస్తోంది. పాన్ ఇండియా కాదు, ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేయడానికి మన మేకర్స్ కు ఇదే అతిపెద్ద బ్రహ్మాస్త్రంగా మారింది.
హనుమాన్, కల్కి చూపించిన దారి: ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ‘హనుమాన్’ భారీ బడ్జెట్ లేకపోయినా విజువల్స్ పరంగా, ఎమోషన్ పరంగా దేశవ్యాప్తంగా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఆ తర్వాత నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 AD’ మన మహాభారతంలోని అశ్వత్థామ, కర్ణుడు లాంటి పాత్రలను భవిష్యత్తు (సైన్స్ ఫిక్షన్) కు ముడిపెట్టి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఈ సినిమాలు మన పురాణాల్లోని సూపర్ హీరోల సత్తా ఏంటో బాక్సాఫీస్‌కు రుచిచూపించాయి.
క్యూలో ఉన్న వందల కోట్ల ప్రాజెక్టులు: ఈ మైథాలజీ ఫార్ములా సేఫ్ అని నమ్మిన నిర్మాతలు ఇప్పుడు వందల కోట్లు కుమ్మరిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రాబోతున్న ‘జై హనుమాన్’, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’, వచ్చి ప్రశంశలు అందుకున్న విషయం తెలిసిందే అలాగే నితీశ్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ‘రామాయణ’ (రణబీర్ కపూర్, యశ్).. ఇవన్నీ మన పురాణాల ఆధారంగా వస్తున్నవే. అధె విదంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇలాంటి కథ తోనే నెక్స్ట్ తీయాలని చూస్తున్నాడు అయ్యప్ప దేవునికి సంబందించిన స్టోరీ అని jr ntr తో తీసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.. ఇంకా చిరంజీవి చేస్తున్న విశ్వంభర మూవీ కూడా అధె జోనర్ లో చేస్తున్న సినిమానే.. మన వేదాల్లో ఉన్న సైన్స్, అస్త్రాలు, చిరంజీవుల కాన్సెప్ట్స్ ను హాలీవుడ్ టెక్నాలజీతో బ్లెండ్ చేసి చూపిస్తే, యూనివర్సల్ అప్పీల్ వస్తుందని మన డైరెక్టర్లు బలంగా నమ్ముతున్నారు. రాబోయే ఐదేళ్ల పాటు ఇండియన్ సినిమాను శాసించేది ఈ మైథాలజీ కథలే!
మరి మీకు ఎలాంటి కథలు అంటే ఇష్టం కామెంట్స్ లో మాతో పంచుకోండి..
