‘ఐటెం సాంగ్ కోసమే కోట్లు ఖర్చు పెడుతున్న నిర్మాతలు, అసలు సీక్రెట్ ఇదే!
ఒకప్పుడు సినిమాలో ‘ఐటెం సాంగ్’ అంటే ముమైత్ ఖాన్, జయమాలిని లాంటి ప్రత్యేక నర్తకీమణులు (Special Dancers) మాత్రమే చేసేవారు. వాటి బడ్జెట్ కూడా తక్కువే ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. వాటిని ‘ఐటెం సాంగ్స్’ అనడం మానేసి “స్పెషల్ డ్యాన్స్ నంబర్స్” (Special Numbers) అని పిలుస్తున్నారు. ఈ పాటలు చేయడానికి ఇప్పుడు ఏకంగా బాలీవుడ్, టాలీవుడ్ టాప్ హీరోయిన్లు క్యూ కడుతున్నారు. అసలు ఈ ఒక్క పాట కోసం నిర్మాతలు ఎందుకు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు?
‘ఊ అంటావా మావా’ తెచ్చిన మార్పు: ‘పుష్ప’ సినిమాలో సమంత చేసిన ‘ఊ అంటావా మావా’ పాట దేశవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఒక్క పాట సినిమా పాన్-ఇండియా ప్రమోషన్స్‌కి ఎంతగానో హెల్ప్ అయింది. రీసెంట్ గా నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో కేతిక శర్మ పాట పుష్ప 2 లో శ్రీలీల, జైలర్ లో తమన్నా, కల్కి లో దిశా పటాని.. ఇంకా లేటెస్ట్ న్యూస్ ప్రకారం రామ్ చరణ్ పెద్ది మూవీ లో ఓ స్టార్ హీరోయిన్ తో ఐటం సాంగ్ చేయిస్తున్నట్టు సమాచారం ఇలా స్టార్ హీరోయిన్లు ఒక ఐదు నిమిషాల పాటలో తళుక్కున మెరిసి థియేటర్లను షేక్ చేస్తున్నారు.
బడ్జెట్ ఏకంగా సినిమాతో సమానం! ఈ స్పెషల్ సాంగ్స్ కోసం హీరోయిన్లకు ఇచ్చే రెమ్యునరేషన్ ఏకంగా రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు ఉంటోంది. దానికి తోడు వందలాది డ్యాన్సర్లు, కోట్ల రూపాయల ఖర్చుతో వేసే భారీ సెట్స్ కలుపుకుంటే, ఒక చిన్న బడ్జెట్ సినిమా తీయాల్సిన డబ్బంతా ఈ ఒక్క పాటకే ఖర్చు అవుతోంది. అయితే, ఈ పాటలను యూట్యూబ్‌లో రిలీజ్ చేసినప్పుడు వచ్చే వ్యూస్, సోషల్ మీడియా రీల్స్ ద్వారా సినిమాకు వచ్చే బజ్ ఆ ఖర్చును ఈజీగా రికవరీ చేస్తోంది. అందుకే మేకర్స్ కథతో సంబంధం లేకపోయినా, బిజినెస్ స్ట్రాటజీలో భాగంగా ఈ స్పెషల్ నంబర్స్ ను ప్లాన్ చేస్తున్నారు.
ఇలా సినిమాలో ఐటం సాంగ్ ఉంటేనే జనాలు చూస్తారా కామెంట్స్ లో మాతో పంచుకోండి
