ఆడియో ఫంక్షన్స్ పోయి ప్రీ-రిలీజ్ ఈవెంట్లు.. కారణం అదే.
ఒకప్పుడు టాలీవుడ్‌లో సినిమా రిలీజ్‌కు ముందు జరిగే ఫంక్షన్ అంటే అదొక పండగ. మణిశర్మ, దేవి శ్రీ ప్రసాద్ (DSP) తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ల ఆడియో లాంచ్ కోసం అభిమానులు నెలల తరబడి ఎదురుచూసేవారు. ఆ వేదికపై పాటలు పాడుతుంటే, ఆ ఎమోషన్ చాలా స్వచ్ఛంగా ఉండేది. కానీ ఇప్పుడు ‘ఆడియో ఫంక్షన్స్’ అనే పదాన్ని పూర్తిగా చెరిపేసి, వాటి ప్లేస్‌లో ‘ప్రీ-రిలీజ్ ఈవెంట్స్’ అనే కొత్త కల్చర్‌ను తీసుకొచ్చారు. కానీ ఆ ఈవెంట్లలో అసలు కంటెంట్ ఎక్కడుంది?
అరుపులు.. కేకలు.. ఫేక్ భజన! ప్రస్తుతం జరుగుతున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో కంటెంట్ కంటే.. యాంకర్ల అరుపులు, బిల్డప్‌లు ఎక్కువైపోయాయి. సినిమా యూనిట్ అంతా ఒకరినొకరు ఆకాశానికి ఎత్తేసుకునే ‘భజన’ కార్యక్రమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దర్శకుడు హీరోను దేవుడు అంటాడు, హీరో దర్శకుడిని క్రియేటర్ అంటాడు.. నిర్మాత ఇద్దరికీ దండాలు పెడతాడు. ఈ రొటీన్ స్పీచ్‌లు, ఫేక్ ఎమోషన్స్ ఆడియన్స్‌కు విపరీతంగా బోర్ కొడుతున్నాయి.
పబ్లిసిటీ వస్తోందా? ట్రోల్స్ వస్తున్నాయా? సినిమాపై హైప్ పెంచడానికి ఈ ఈవెంట్స్ చేస్తున్నామని మేకర్స్ అనుకుంటున్నారు కానీ, సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోలింగ్ జరిగేది ఈ ఈవెంట్లలో మాట్లాడే మాటల వల్లే. ఎప్పుడైతే వేదికపై “ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడతాం, ఆస్కార్ రేంజ్ సినిమా ఇది” అని అతిశయోక్తులు చెబుతున్నారో.. తీరా సినిమా రిలీజ్ అయ్యాక అందులో మ్యాటర్ లేకపోతే ట్రోలర్స్‌కు అడ్డంగా బుక్ అవుతున్నారు. కంటెంట్ మాట్లాడుతుంది తప్ప, ఈవెంట్లలో చేసే ఆర్టిఫిషియల్ హడావుడి సినిమాను బతికించలేదని మేకర్స్ తెలుసుకోవాలి.
మరి దీని పై మీరేమంటారు అప్పటి ఆడియో ఫంక్షన్ లు బాగున్నాయా లేక ఇప్పటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు బాగున్నయా కామెంట్స్ లో మాతో పంచుకోండి.
