బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ విధ్వంసం.. 10 రోజుల్లోనే ఏకంగా అన్ని కోట్లా..మనోడు బ్లాక్‌బస్టర్ కొట్టేసాడు!
అక్కినేని అభిమానుల నిరీక్షణకు తగ్గట్లే అఖిల్ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మాస్ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా, అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచే దిశగా దూసుకుపోతోంది. తొలి వారం అద్భుతమైన వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, రెండో వీకెండ్లో కూడా తన బాక్సాఫీస్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది.
తాజాగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ ద్వారా సెకండ్ వీకెండ్ కలెక్షన్లను ప్రకటించారు. ఈ పోస్టర్లో పండగ వాతావరణంలో ఎద్దుల బండిపై కాలు పెట్టి, పక్కా ఊరమాస్ లుక్‌లో అఖిల్ నిలబడిన తీరు అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. సినిమా రిలీజైన కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 88 కోట్ల గ్రాస్ (88 CR Worldwide Gross) వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేసింది. పోస్టర్‌పై ఎంతో కాన్ఫిడెంట్ గా “మనోడు BLOCKBUSTER కొట్టేసాడు” అని వేసిన క్యాప్షన్ సినిమా సక్సెస్‌ను ఘనంగా చాటుతోంది.
సితారా ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ విలువలు, ఎస్. థమన్ అందించిన పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. నైజాం ఏరియాతో పాటు ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లోని మాస్ సెంటర్లలో వర్కింగ్ డేస్‌లో కూడా స్టెడీగా కలెక్షన్స్ వస్తుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇదే ఊపు కొనసాగితే, మరో రెండు మూడు రోజుల్లోనే లెనిన్ ప్రతిష్టాత్మక ‘100 కోట్ల క్లబ్’లో సగర్వంగా అడుగుపెట్టడం ఖాయం.
మరి మీరు ఏమనుకుంటున్నారు లెనిన్ మూవీ వంద కోట్లు వసూల్ చేస్తుంది అనుకుంటున్నారా కింద కామెంట్ చేయండి.
