Movie News

ఆడియో ఫంక్షన్స్ మాయం..పాటల పండగ ఏమైపోయింది?

ఫంక్షన్’ పేరుతో పెద్ద పండగ జరిగేది. క్యాసెట్లు, సీడీలు లాంచ్ చేస్తూ అభిమానుల మధ్య పాటలు ప్లే చేసేవారు. కానీ ఇప్పుడు ఆ సంస్కృతి పూర్తిగా కనుమరుగైపోయింది. ఆడియో ఫంక్షన్స్ స్థానంలో కేవలం సినిమా రిలీజ్‌కు వారం ముందు చేసే ‘ప్రీ-రిలీజ్ ఈవెంట్స్’ మాత్రమే కనిపిస్తున్నాయి.

మ్యూజిక్ డైరెక్టర్లకు సరైన గుర్తింపు ఏదీ? ఇప్పుడు సాంగ్స్‌ను కేవలం యూట్యూబ్ లిరికల్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Reels) ద్వారా మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం మ్యూజిక్ ని ఒక టూల్ లా వాడుకుంటున్నారు తప్ప, మ్యూజిక్ కి ఒకప్పుడు ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆడియో లాంచ్ లేకపోవడం వల్ల మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్స్, లిరిసిస్ట్‌లు తమ కష్టాన్ని స్టేజ్ మీద పంచుకునే అవకాశం లేకుండా పోయింది.

హైప్ కోసమే ప్రీ-రిలీజ్! సినిమా రిలీజ్ అయ్యే వారం ముందు బజ్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్లను వాడుతున్నారు. యూట్యూబ్ వ్యూస్, సోషల్ మీడియా రీచ్ పెరిగిన ఈ కాలంలో.. ఆడియో ఫంక్షన్స్ చేసి బడ్జెట్ పెంచడం దండగ అని నిర్మాతలు భావిస్తున్నారు. ట్రెండ్ మారినా.. ఆ పాత ఆడియో ఫంక్షన్స్ ఇచ్చిన కిక్ మాత్రం ఇప్పుడు మిస్ అవుతున్నామనేది సత్యం.

సినీ అభిమానులు గా మీరు ఏమంటారు కింద కామెంట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *