100 కోట్ల దిశగా “ఇరుముడి”.. స్టార్ ఇమేజ్‌కు బ్రేక్ వేసి కథకే ఓటు వేసిన రవితేజ!
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) రూటే సెపరేటు. ఇన్నాళ్లూ తనదైన మాస్ ఎనర్జీ, రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాతో ఆడియన్స్‌ను అలరించిన ఆయన.. ఈసారి దానికి పూర్తి భిన్నంగా ఆలోచించారు. తన స్టార్ ఇమేజ్‌కు బ్రేక్ వేసి, కేవలం కంటెంట్‌ను మాత్రమే నమ్మి ఆయన చేసిన ‘ఇరుముడి’ (Irumudi) చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది.
స్టార్ ఇమేజ్‌కు బ్రేక్.. కథకే రవితేజ ఓటు! సాధారణంగా ఒక స్టార్ హీరో ఇమేజ్ చట్రంలో ఇరుక్కుంటే, దాని నుంచి బయటకు వచ్చి ప్రయోగాలు చేయడానికి చాలా సమయం పడుతుంది. కానీ రవితేజ మాత్రం సాహసం చేశారు. ఫ్యాన్స్ కోరుకునే రెగ్యులర్ కమర్షియల్ హంగులను, యాక్షన్ సీక్వెన్స్‌లను పక్కనపెట్టి.. ఒక బలమైన కథకే ఓటు వేశారు. దర్శకుడి విజన్‌ను పూర్తిగా నమ్మి, అందులోని పాత్రకు తన సహజమైన నటనతో ప్రాణం పోశారు. ఇమేజ్ కన్నా కథ ముఖ్యం అని ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
100 కోట్ల ధమాకాతో దూసుకుపోతున్న ఇరుముడి.. కంటెంట్ బాగుంటే తెలుగు ఆడియన్స్ కచ్చితంగా బ్రహ్మరథం పడతారని ‘ఇరుముడి’ సక్సెస్ మరోసారి నిరూపించింది. మొదటి ఆట నుంచే మౌత్ టాక్ (Word of mouth) అద్భుతంగా స్ప్రెడ్ అవ్వడంతో, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రవితేజ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ధమాకా’ ఏ రేంజ్‌లో వసూళ్లు రాబట్టిందో.. ఇప్పుడు “ఇరుముడి” కూడా అదే రేంజ్‌లో 100 కోట్ల క్లబ్ దిశగా జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది.
ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ (Break Even) కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం, డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు 100 కోట్ల పైమాటే లక్ష్యంగా “ఇరుముడి” దూసుకెళ్తోందని ట్రేడ్ వర్గాలు సగర్వంగా ప్రకటిస్తున్నాయి. మొత్తానికి రవితేజ కేవలం మాస్ సినిమాలతోనే కాదు.. కంటెంట్ ఉన్న సినిమాలతో కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేయగలడని ఈ సినిమా నిరూపించింది.
మరి సినీ అభిమనులుగా మీరు మూవీ చూసారా మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి…
