Reviews

‘పెద్ది’ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ పర్ఫార్మెన్స్.. ఫస్ట్ హాఫ్ కిక్, సెకండ్ హాఫ్ లాగ్!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ‘పెద్ది’ (Peddi) సినిమా ఓవరాల్‌గా చెప్పాలంటే.. సినిమా ‘పర్లేదు.. ఒక యావరేజ్ వాచ్’ అనిపిస్తుంది. మరి ఎక్కడ వర్కవుట్ అయింది? ఎక్కడ మిస్ అయింది? క్యారెక్టర్లు ఎలా ఉన్నాయో డీటెయిల్డ్‌గా చూద్దాం.

ఫస్ట్ హాఫ్: అదిరిపోయే క్రికెట్ మూమెంట్స్!

సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ముఖ్యంగా పీరియాడిక్ నేపథ్యంలో వచ్చే ఆ క్రికెట్ మూమెంట్స్, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ థియేటర్లలో మంచి కిక్ ఇస్తాయి. చరణ్ అన్న యాక్టింగ్ గురించి మనం సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు; ఏ క్యారెక్టర్ ఇచ్చినా వంద శాతం ప్రాణం పెడతారు. ఇందులో కూడా తన రగ్గడ్ లుక్ అండ్ యాక్టింగ్ తో అదరగొట్టారు. రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా అక్కడక్కడా బాగానే సెట్ అయింది.

హీరోయిన్ క్యారెక్టరైజేషన్: ఆ ఎక్స్‌పోజింగ్ అవసరమా?

ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ, హీరోయిన్ జాన్వీ కపూర్ క్యారెక్టర్‌ను డైరెక్టర్ బుచ్చిబాబు గారు చూపించిన విధానం మాత్రం కాస్త నిరాశ పరిచింది. అంత మంచి థీమ్, ప్లాట్ తీసుకున్నప్పుడు హీరోయిన్‌ను కేవలం గ్లామర్ అండ్ హెవీ ఎక్స్‌పోజింగ్ (Exposure) కే ఎందుకు పరిమితం చేశారో అర్థం కాలేదు. హీరోకి సపోర్ట్ చేసేలా కాస్త డిఫరెంట్‌గా చూపించి ఉంటే బాగుండేది. కేవలం గ్లామర్ కోసమే అన్నట్టుగా ఆమె క్యారెక్టర్‌ను పూర్తిగా వేస్ట్ చేసేశారు.

సెకండ్ హాఫ్: మిస్ అయిన ఎమోషన్.. హెవీ లాగ్!

ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. స్టార్టింగ్ లో కొన్ని మూమెంట్స్ పర్లేదు అనిపించినా, లాస్ట్ కి వచ్చేసరికి సినిమా చాలా లాగ్ (Lag) అనిపిస్తుంది. సినిమాకు మెయిన్ పిల్లర్ అవ్వాల్సిన ‘ఎమోషన్’ ఇక్కడ పూర్తిగా మిస్ అయింది. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు “అబ్బా.. చరణ్ అన్న సినిమా సూపర్ గా ఉంది” అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ కలగాల్సింది, కానీ అది ఎక్కడో మిస్ అయి ఒక నార్మల్ యావరేజ్ ఫీలింగ్ మాత్రమే మిగులుతుంది. బుచ్చిబాబు గారు ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్లకుండా.. కోర్ పాయింట్ మీదే స్ట్రిక్ట్ గా ఉండి ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది.

నటీనటుల పర్ఫార్మెన్స్:

  • రామ్ చరణ్: వన్ మ్యాన్ షో. తన యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు.
  • శివరాజ్ కుమార్: కర్ణాటక వర్సటైల్ హీరో శివన్న ఉన్న పోర్షన్స్ అన్నీ సినిమాలో చాలా బాగా అనిపిస్తాయి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మేజర్ ప్లస్.
  • మిగతా పాత్రలు: విలన్ గా జగపతిబాబు గారు పర్లేదు, బాగానే చేశారు. బొమ్మన్ ఇరానీ గారిది జస్ట్ నార్మల్ క్యారెక్టర్. కానీ, ‘మిర్జాపూర్’ ఫేమ్ దివ్యాందు శర్మ లాంటి మంచి యాక్టర్‌ను ఎందుకు పెట్టుకున్నారో, ఆయన పాత్ర ఏంటో అస్సలు అర్థం కాలేదు.. కంప్లీట్ గా వేస్ట్ చేశారు.

సిని దావత్ ఫైనల్ వర్డ్:

సినిమాలో గ్లామర్ డోస్ కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ.. మరీ ఫ్యామిలీతో చూడలేనంత భయంకరమైన వల్గారిటీ (Vulgarity) అయితే లేదు. కాబట్టి థియేటర్లకు వెళ్లి హ్యాపీగా ఒకసారి చూడొచ్చు. చాలా కష్టపడి సినిమాలు తీస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరూ పైరసీని ఎంకరేజ్ చేయకండి. థియేటర్లలోనే ‘పెద్ది’ని ఎక్స్‌పీరియన్స్ చేయండి!

మన సిని దావత్ రేటింగ్: 2.75 / 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *