పెద్ది’ బాక్సాఫీస్ సునామీ: 9 రోజుల్లో అన్నికోట్లా.. ‘సౌత్ ఇండియా నంబర్ 1 గ్రాసర్’ గా రామ్ చరణ్ రికార్డ్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఊరమాస్ పర్ఫార్మెన్స్‌తో థియేటర్లలో దద్దరిల్లుతున్న సినిమా ‘పెద్ది’ (Peddi). మొదటి వారం వసూళ్ల సునామీ సృష్టించిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా, రెండవ వారంలోకి అడుగుపెట్టి సరికొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. తాజాగా మేకర్స్ 9 రోజుల కలెక్షన్స్ పోస్టర్‌ను విడుదల చేయగా, అందులోని నంబర్స్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.
2026 సౌత్ ఇండియా నంబర్ 1 గ్రాసర్! అధికారిక లెక్కల ప్రకారం, బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ‘పెద్ది’ సినిమా కేవలం 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 366 కోట్ల గ్రాస్ (366 CR+ Gross Worldwide) కొల్లగొట్టింది. ఈ భారీ వసూళ్లతో ఈ చిత్రం “సౌత్ ఇండియాస్ నంబర్ 1 గ్రాసర్ ఆఫ్ 2026” (South India’s No. 1 Grosser of 2026) గా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన ఏ సౌత్ ఇండియన్ సినిమా సాధించని కలెక్షన్లను చరణ్ తన సింగిల్ స్టామినాతో సాధించి చూపించాడు.
రన్నింగ్ ట్రాక్ పై రేసుగుర్రం! తాజాగా వదిలిన పోస్టర్ లో ‘ఇండియా’ (India) అని రాసి ఉన్న బ్లూ జెర్సీ వేసుకుని అథ్లెట్ గా ట్రాక్ పై పరుగెడుతున్న రామ్ చరణ్ లుక్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. సినిమాలో క్రికెట్, కుస్తీ తో పాటు ఈ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఎమోషన్ కూడా ఆడియన్స్ కు బలంగా కనెక్ట్ అయింది. సెకండ్ వీకెండ్ (శుక్రవారం) స్టార్ట్ అవ్వడంతో వసూళ్లలో మరోసారి మంచి జంప్ కనిపించింది.
400 కోట్ల క్లబ్‌కు కౌంట్‌డౌన్ షురూ! ఇప్పటికే 366 కోట్లు దాటేయడంతో, ఈ శని, ఆదివారాలు పూర్తయ్యేసరికి ‘పెద్ది’ అఫీషియల్ గా రూ. 400 కోట్ల క్లబ్‌లోకి దర్జాగా ఎంట్రీ ఇవ్వడం ఖాయమైపోయింది. సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ పెరగడం, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడంతో బుకింగ్స్ ఎక్సలెంట్ గా జరుగుతున్నాయి. ఫుల్ రన్ లో ఈ సినిమా చరణ్ కెరీర్ లోనే (నాన్-ఆర్ఆర్ఆర్) ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ కలెక్షన్లను టచ్ చేస్తుందని బయ్యర్లు ధీమాగా ఉన్నారు!
చూడాలి మరి లాంగ్ రన్ మూవీ ఎంత వసూల్ చెస్తధో మీరేమంటారు కింద కామెంట్ చేయండి.
