‘పెద్ది’ లుక్ పై.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కామెంట్స్ వైరల్!
హైదరాబాద్: మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్లో సందడి మామూలుగా లేదు. ముఖ్యంగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ (Peddi – Peddi Pehelwan) సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్ చూసి అభిమానులే కాదు, సినీ ప్రముఖులు కూడా ఫిదా అవుతున్నారు.
తాజాగా ఈ లుక్‌పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో చరణ్‌తో ‘గోవిందుడు అందరివాడేలే’ వంటి క్లాసిక్ సినిమాను రూపొందించిన కృష్ణవంశీ, చరణ్ కొత్త అవతారాన్ని చూసి ముగ్ధులయ్యారు.
వజ్రంలా మెరిసిపోతున్నావ్ నాన్నా..!
కృష్ణవంశీ తన ట్విట్టర్ (X) వేదికగా స్పందిస్తూ.. “చూడగానే నా ఇష్టదైవం ఆంజనేయస్వామి గుర్తొచ్చాడు ఎందుకో… చరణ్… సానబెట్టిన నిఖార్సైన వజ్రం లా మెరుపులు చిమ్ముతున్నావ్ నాన్నా…. ఆయుష్మాన్‌భవ… ఆరోగ్య సిద్ధిరస్తు. శతసహస్ర ఐశ్వర్య సిద్ధిరస్తు.. అపూర్వమైన జన్మదిన శుభాకాంక్షలు.. విజయోస్తు” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
చరణ్‌ను ఆంజనేయస్వామితో పోల్చడం మరియు “సానబెట్టిన వజ్రం” అని సంబోధించడం మెగా అభిమానులకు ఎంతో సంతోషాన్నిస్తోంది. ఒక గురువు స్థానంలో ఉండి చరణ్‌ను ఆయన దీవించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.
పెద్ది పై భారీ అంచనాలు
వృద్ది సినిమాస్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఉత్తర ఆంధ్ర నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ ఒక పహిల్వాన్ పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం చరణ్ తన బాడీని పూర్తిగా మార్చుకోవడం, ఈ ఫస్ట్ లుక్‌తోనే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థమవుతోంది.
మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ‘సినీ దావత్ ‘ (Cine Dawat).
