OTT Updates

ఓటీటీల కొత్త రూల్.. టాలీవుడ్ నిర్మాతలకు షాక్

కప్పుడు టాలీవుడ్ నిర్మాతలకు ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్స్ ఒక ఏటీఎం (ATM) లా ఉండేవి. సినిమా సెట్స్ పైకి వెళ్లగానే, అందులో ఉన్న హీరో లేదా డైరెక్టర్ క్రేజ్ ని బట్టి నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ లాంటి దిగ్గజ సంస్థలు వందల కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చి నాన్-థియేట్రికల్ రైట్స్ కొనేసేవి. సినిమా థియేటర్లలో ప్లాప్ అయినా, నిర్మాతలు ఓటీటీ రైట్స్ ద్వారా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయేవారు. కానీ, ఇప్పుడు ఆ గోల్డెన్ డేస్ ముగిశాయి. ఓటీటీ సంస్థలు ఇప్పుడు తమ బిజినెస్ రూల్స్‌ను పూర్తిగా మార్చేశాయి.

సక్సెస్ అయితేనే.. లేదా పే-పర్-వ్యూ! ఓటీటీలు ఇప్పుడు గుడ్డిగా కోట్లు కుమ్మరించడం లేదు. “ముందు సినిమాను థియేటర్‌లో రిలీజ్ చేయండి.. అక్కడ హిట్ అయితేనే మేము కొంటాం” అని తెగేసి చెబుతున్నాయి. దీనికి తోడు ‘పే-పర్-వ్యూ’ (Pay-per-view) లేదా ‘సక్సెస్ బేస్డ్ మోడల్’ను తెరపైకి తెచ్చాయి. అంటే, సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాక, ఎంతమంది ఆడియన్స్ ఆ సినిమాను చూశారు (వ్యూవర్షిప్ మినిట్స్) అన్నదాని ఆధారంగానే నిర్మాతలకు డబ్బులు ఇస్తామంటున్నాయి.

నిర్మాతల పరిస్థితి ఏంటి? ఈ కొత్త రూల్స్ వల్ల టాలీవుడ్ ఫైనాన్స్ సిస్టమ్ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే రిస్క్‌తో కూడుకుని ఉంది. ఇప్పుడు ఓటీటీలు కూడా చేయి దాటిపోవడంతో, చిన్న, మీడియం రేంజ్ నిర్మాతలు పెట్టుబడిని ఎలా రికవరీ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. సినిమా ఫ్లాప్ అయితే, ఇటు థియేటర్ల ద్వారా డబ్బులు రావు, అటు ఓటీటీ వాళ్లు అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. దీంతో నిర్మాతలు అప్పుల పాలై రోడ్డున పడే పరిస్థితి వస్తోంది. కేవలం కంటెంట్ మీద అపారమైన నమ్మకం ఉంటే తప్ప.. సినిమాలు నిర్మించే సాహసం చేయలేని దశకు టాలీవుడ్ చేరుకుంది.

ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్స్ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు దీనివల్ల ఎవరికి ఉపయోగం అని మీరు బావిస్తున్నారు కామెంట్స్ లో రాయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *