బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ విధ్వంసం.. 4 రోజుల్లోనే అన్ని కోట్లా..ఎక్కడ ఎంత అంటే ..?
అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆకలితో ఎదురుచూస్తున్న సాలిడ్ బ్లాక్‌బస్టర్ రానే వచ్చింది. అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఊరమాస్ అవతార్‌లో నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ (Lenin) బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. మూడేళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన అఖిల్.. ఈసారి పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌తో విరాటరూపం చూపిస్తున్నాడు.
4 రోజుల్లోనే రికార్డ్ వసూళ్లు.. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన అఫీషియల్ పోస్టర్ చూస్తుంటే అఖిల్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో అర్థమవుతోంది. కేవలం 4 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 67.2 కోట్ల గ్రాస్ (67.2 CR Worldwide Gross) వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
తాజాగా విడుదల చేసిన కలెక్షన్స్ పోస్టర్‌లో.. సైకిల్ పై హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే (Bhagyashri Borse) ను కూర్చోబెట్టుకుని అఖిల్ చిరునవ్వులు చిందిస్తున్న లుక్ ఆకట్టుకుంటోంది. ఈ బ్యూటిఫుల్ పోస్టర్‌పై మేకర్స్ గర్వంగా వేసిన “మనోడు BLOCKBUSTER కొట్టేసాడు” అనే ట్యాగ్‌లైన్ అక్కినేని అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది.
మాస్ సెంటర్లలో తగ్గేదేలే.. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, నాగార్జున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. యాక్షన్ సీక్వెన్స్‌లలో అఖిల్ పెర్ఫార్మన్స్, థమన్ (Thaman S) బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు అతిపెద్ద ప్లస్ అవ్వడంతో బి, సి సెంటర్లలో (B & C Centers) లెనిన్ కు తిరుగులేకుండా పోయింది.
వర్కింగ్ డేస్ లో కూడా బుకింగ్స్ స్ట్రాంగ్ గా ఉండటంతో.. ఇదే జోరు కొనసాగితే ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి లెనిన్ 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవ్వడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరి మూవీ మీరు చూశారా మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి.
