Collections

‘పెద్ది’ బాక్సాఫీస్ ఊచకోత: 4 రోజుల్లో రూ. 292.5 కోట్లు..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ పహిల్వాన్‌గా తన ఊరమాస్ ర్యాంపేజ్ కంటిన్యూ చేస్తున్నాడు. మిక్స్‌డ్ టాక్‌తో మొదలైన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా, కేవలం చరణ్ స్టార్‌డమ్ మరియు వీకెండ్ హాలిడే అడ్వాంటేజ్‌తో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా మేకర్స్ అధికారికంగా విడుదల చేసిన పోస్టర్ ప్రకారం, ‘పెద్ది’ సినిమా మొదటి 4 రోజుల్లో ఏకంగా రూ. 292.5 కోట్ల గ్రాస్ (292.5 CR+ Gross Worldwide) కొల్లగొట్టి ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ గా నిలిచింది.

ఆదివారం అదిరిపోయే జంప్.. ఏకంగా 55.8 కోట్లు! మొదటి 3 రోజుల్లో రూ. 236.7 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, నిన్న ఆదివారం (Day 4) హాలిడే కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్లు కళకళలాడాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం నిన్న ఒక్కరోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 55.8 కోట్ల భారీ గ్రాస్ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. దర్శకుడు బుచ్చిబాబు సానా డిజైన్ చేసిన క్రికెట్ ఎపిసోడ్స్, చరణ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ బి, సి (B & C) సెంటర్ల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడమే ఈ జంప్‌కు ప్రధాన కారణం.

టార్గెట్ 300 కోట్లు.. ఇక అసలు టెస్ట్ మొదలు! ఈరోజు (సోమవారం) నాటికి ‘పెద్ది’ సినిమా చాలా ఈజీగా రూ. 300 కోట్ల మార్క్‌ను దాటేయడం ఖాయం. అయితే, ఫస్ట్ వీకెండ్ పూర్తయింది కాబట్టి సినిమాకు ఇక అసలు ‘మండే టెస్ట్’ (Monday Test) మొదలైంది. వర్కింగ్ డేస్ లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తుందనే దానిపైనే బయ్యర్ల లాభనష్టాలు ఆధారపడి ఉంటాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే, మాస్ ఏరియాల్లో సోమవారం కూడా సినిమా మంచి వసూళ్లు రాబట్టే అవకాశం కనిపిస్తోంది.

మరి రూ. 300 కోట్ల క్లబ్‌లో అడుగుపెడుతున్న చరణ్.. ఫుల్ రన్‌లో ఇంకెన్ని రికార్డులను బ్రేక్ చేస్తాడో చూడాలి!

మరి మీరు ఏమనుకుంటున్నారు ఇంకా ఎన్ని వందల కోట్లు వసూల్ చేస్తుంది కిందా కామెంట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *