Viral News

లేడీ ఓరియెంటెడ్ మార్కెట్ ఏమైంది? విజయశాంతి, అనుష్కల తర్వాత ఆ స్థానం ఎవరిధి..?

ఒకప్పుడు లేడీ అమితాబ్ విజయశాంతి గారి ‘కర్తవ్యం’, ‘ఒసేయ్ రాములమ్మ’ లాంటి సినిమాలు వస్తే థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యేవి. స్టార్ హీరోలకు సమానంగా ఆమె సినిమాలు ఆడేవి. ఆ తర్వాత అనుష్క శెట్టి గారి ‘అరుంధతి’, ‘భాగమతి’ చిత్రాలు కూడా ఆ మ్యాజిక్ ని రిపీట్ చేశాయి. అయితే, ఆ తర్వాత ఎంత మంది టాప్ హీరోయిన్లు ట్రై చేసినా.. లేడీ ఓరియెంటెడ్ (Female-centric) సినిమాల మార్కెట్ మాత్రం టాలీవుడ్‌లో పూర్తిగా డల్ అయిపోయింది.

రిస్క్ చేయడం లేఖిపోయారా? సమంత (‘ఓ బేబీ’, ‘యశోద’), కీర్తి సురేష్ (‘మహానటి’, ‘మిస్ ఇండియా’) లాంటి వాళ్లు కొన్ని ప్రయత్నాలు చేసి సక్సెస్ సాధించినా, ఒక కన్సిస్టెంట్ సోలో బాక్సాఫీస్ మార్కెట్‌ను మాత్రం క్రియేట్ చేసుకోలేకపోయారు. ప్రస్తుత పాన్-ఇండియా, భారీ వీఎఫ్ఎక్స్, మల్టీ-స్టారర్ల యుగంలో కేవలం ఒక హీరోయిన్ ఇమేజ్ మీద కోట్లు ఖర్చు పెట్టడానికి నిర్మాతలు ధైర్యం చేయలేకపోతున్నారు. మరోవైపు హీరోయిన్లు కూడా సేఫ్ గేమ్ ఆడుతూ స్టార్ హీరోల సినిమాల్లో కమర్షియల్ పాత్రలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

బలమైన కథల కొరత: లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అనగానే కేవలం దయ్యాల కథలో, లేదా మహిళలు ఎదుర్కొనే కష్టాల చుట్టూనే మన డైరెక్టర్లు కథలు అల్లుతున్నారు తప్పితే, ఒక మహిళా పోలీసు, లేదా ఒక స్పై, పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా లాంటి సరికొత్త జానర్లను టచ్ చేయలేకపోతున్నారు. సరైన స్క్రిప్ట్స్ దొరకకపోవడమే ఈ లేడీ ఓరియెంటెడ్ మార్కెట్ పడిపోవడానికి ప్రధాన కారణం. విజయశాంతి, అనుష్కల తర్వాత ఆ ఖాళీ సింహాసనాన్ని భర్తీ చేసే దమ్మున్న ఫీమేల్ సూపర్ స్టార్ టాలీవుడ్ కు ఎప్పుడు దొరుకుతుందో చూడాలి!

మరి మీరు ఇంకా ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఇప్పటి హీరోయిన్లలో ఎవరు చేస్తే బాగుంటది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *