పాన్-ఇండియా పైత్యం: బలవంతపు క్యాస్టింగ్ తో మన సినిమాల ‘ఆత్మ’ చచ్చిపోతోందా?
‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ విజయాల తర్వాత ఇండస్ట్రీలో ‘పాన్-ఇండియా’ (Pan-India) అనే పదం ఒక మంత్రంలా మారిపోయింది. ప్రతి చిన్న డైరెక్టర్, ప్రతి టైర్-2 హీరో కూడా తమ సినిమా పాన్-ఇండియా అని ప్రకటించేసుకుంటున్నారు. కానీ, పాన్-ఇండియా అప్పీల్ తీసుకురావాలనే ఆరాటంలో మన దర్శకులు చేస్తున్న అతిపెద్ద తప్పు.. బలవంతపు క్యాస్టింగ్ (Forced Casting).
బాలీవుడ్ విలన్లు.. కోలీవుడ్ మ్యూజిక్! హిందీ మార్కెట్ కావాలని బాలీవుడ్ నుంచి ఒక పాత విలన్‌ను, తమిళ మార్కెట్ కావాలని అక్కడి నుంచి ఒక కమెడియన్‌ను, కన్నడ నుంచి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ను తీసుకొచ్చి సినిమాలో పెడుతున్నారు. తీరా చూస్తే ఆ బాలీవుడ్ విలన్ లిప్ సింక్ మన తెలుగు డైలాగ్స్‌కు ఏమాత్రం సెట్ అవ్వదు. ఆ పాత్రల మధ్య ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్ ఉండదు. ఇది కథలో సహజత్వాన్ని (Nativity) పూర్తిగా చంపేస్తోంది.
కథ పాన్-ఇండియా ఉండాలి కానీ.. క్యాస్టింగ్ కాదు! కథలో యూనివర్సల్ ఎమోషన్ ఉంటే.. అందులో నటించింది కొత్తవాళ్లైనా దేశం మొత్తం చూస్తుంది అనడానికి ‘కాంతార’, ‘మంజుమ్మెల్ బాయ్స్’ లాంటి సినిమాలు బెస్ట్ ఎగ్జాంపుల్స్. కేవలం బిజినెస్ కోణంలో పరభాషా నటులను నింపేస్తే అది ఒక ‘ఖిచిడీ’ సినిమా అవుతుందే తప్ప, క్లాసిక్ అవ్వదు అని ట్రేడ్ పండితులు హెచ్చరిస్తున్నారు. ఈ పాన్-ఇండియా పైత్యం తగ్గించుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
మరి దీని పై మీరు ఏమంటారు ఈ పాన్ ఇండియా ట్రెండ్ వల్ల ఎవరు నష్ట పోతారు కామెంట్స్ లో రాయండి..
