పట్టాలెక్కిన ‘ఆదర్శ కుటుంబం’.. వెంకీ మామ, గురూజీ క్రేజీ వర్కింగ్ స్టిల్ అవుట్!
టాలీవుడ్ ప్రేక్షకులకు విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ (రచయితగా త్రివిక్రమ్) సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరించాయో మనందరికీ తెలిసిందే. ఆ వింటేజ్ మ్యాజిక్ ను రిపీట్ చేస్తూ, ఇప్పుడు ఏకంగా దర్శకుడిగా వెంకటేష్‌ను డైరెక్ట్ చేస్తున్నారు త్రివిక్రమ్.
వెంకటేష్ 77వ చిత్రంగా (Venky77) వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam) అనే టైటిల్ వర్కింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెట్స్ నుండి మేకర్స్ ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
సెట్స్‌లో ముమ్మరంగా షూటింగ్..
ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ సినిమా వర్కింగ్ స్టిల్‌ను అభిమానులతో పంచుకుంది.

“అందరికీ ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు.. ఒక స్పెషల్ ప్రాజెక్ట్‌ను నిర్మించే పనిలో ఉన్నారు.. ఆదర్శ కుటుంబం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది” అంటూ పోస్ట్ చేసింది. మేకర్స్ రిలీజ్ చేసిన ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో.. ఒక రైలు (A.C. Two Tier) సెట్ వద్ద వెంకటేష్ మరియు త్రివిక్రమ్ ఎంతో ఆసక్తికరంగా సినిమా గురించి చర్చిస్తున్నట్లు కనిపిస్తోంది. ఫోటో వైబ్ చూస్తుంటే గురూజీ ఈసారి అదిరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రెడీ చేస్తున్నట్లు అర్థమవుతోంది.
హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి..
ఈ సినిమాలో వెంకటేష్ సరసన ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్గా నటిస్తోంది. ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్, ఎమోషన్స్‌తో పాటు.. వెంకీ మామ వింటేజ్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్.
చాలా కాలం తర్వాత వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబో సెట్స్ పైకి వెళ్లడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ మరియు ఫస్ట్ లుక్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఈ వర్కింగ్ స్టిల్ ఎలా ఉందో కామెంట్స్ లో మాతో పంచుకోండి.
