రణబాలి మూవీ రివ్యూ: ‘కరువు’ రాక్షసుడిపై విజయ్ దేవరకొండ పోరాటం.. ఆకట్టుకుందా?
నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, అర్నాల్డ్ వోస్లూ (హాలీవుడ్ నటుడు), ఈశ్వరీ రావు, వినోద్ సాగర్, లాల్ తదితరులు
దర్శకత్వం: రాహుల్ సాంకృత్యన్
సంగీతం: అజయ్ – అతుల్
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
సినీ దావత్ రేటింగ్: 3/5
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఎప్పటినుంచో ఒక సాలిడ్ పాన్ ఇండియా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ‘టాక్సీవాలా’ లాంటి సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్‌తో ముచ్చటగా రెండోసారి జతకట్టి చేసిన భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ (Ranabaali). పెళ్లి తర్వాత విజయ్ – రష్మిక మందన్న కలిసి నటించిన తొలి సినిమా కావడం, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ‘రణబాలి’ ఆ అంచనాలను అందుకుందా? విజయ్ దేవరకొండ ఖాతాలో బ్లాక్ బస్టర్ పడిందా? రివ్యూలో చూద్దాం..
కథా నేపథ్యం:
1850-1870ల కాలం నాటి బ్రిటిష్ పాలనలోని మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంగా ఈ కథ సాగుతుంది. రాయలసీమలోని సింగనమల ప్రాంత ప్రజలను కాపాడేందుకు భద్రమల్లన్న స్వామి ఆశీస్సులతో పుడతాడు సింగనమల బొబ్బిలి రణబాలి (విజయ్ దేవరకొండ). దేవుడి అంశతో పుట్టిన రణబాలికి జయమ్మ (రష్మిక మందన్న)తో వివాహం జరుగుతుంది. కరువు రాక్షసుడిగా పేరుగాంచిన బ్రిటిష్ అధికారి సర్ థియోడర్ హెక్టర్ (అర్నాల్డ్ వోస్లూ) వల్ల ఆ ప్రాంతంలో కృత్రిమ కరువు ఏర్పడుతుంది. ఇక్కడ పండిన ధాన్యాన్ని ఇంగ్లాండ్‌కు తరలిస్తూ.. రైతులను రైల్వే కూలీలుగా మార్చి చిత్రహింసలు పెడతారు. ఆకలితో అలమటిస్తున్న తన ప్రజలను రణబాలి ఎలా రక్షించాడు? బ్రిటిష్ కుట్రలను ఎలా ఎదిరించాడు? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన ఒక చీకటి అధ్యాయాన్ని (కరువు నేపథ్యం), జానపద గాథను మేళవించి సినిమాగా మలచడంలో డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ సక్సెస్ అయ్యాడు. సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా సాగినా.. విలన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథ ఊపందుకుంటుంది. బ్రిటిష్ వాళ్లు పెట్టే చిత్రహింసలు, అప్పటి ప్రజల ఆకలి కేకలను దర్శకుడు హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించాడు. ఫస్టాఫ్‌లో విజయ్ – రష్మిక మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, ఇంటర్వెల్ ముందు వచ్చే సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు.
అయితే సెకండాఫ్ మొదలయ్యాక కథ కాస్త ఊహకు అందేలా, పాత దేశభక్తి సినిమాల ఛాయల్లో రొటీన్‌గా సాగుతుంది. రన్ టైమ్ (2 గంటల 50 నిమిషాలు) కాస్త ఇబ్బంది పెడుతుంది. గుహలో వచ్చే ఫైట్, ప్రీ-క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ సినిమాను మళ్లీ ట్రాక్‌లోకి తెస్తాయి.
నటీనటుల పర్ఫార్మెన్స్:
రణబాలి పాత్ర విజయ్ దేవరకొండ కెరీర్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. తన లుక్, రాయలసీమ (కడప) యాస పలికిన విధానం, ముఖంలో రౌద్రం సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లాయి. జయమ్మగా రష్మిక మందన్న సెకండాఫ్ ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టిస్తుంది. వీళ్లిద్దరి కెమిస్ట్రీ సూపర్బ్. ‘మమ్మీ’ ఫేమ్ హాలీవుడ్ నటుడు అర్నాల్డ్ వోస్లూ క్రూరమైన బ్రిటిష్ అధికారిగా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తోనే భయపెట్టాడు. రణబాలి తల్లిగా ఈశ్వరీ రావు నటన ఆకట్టుకుంటుంది.
సాంకేతిక వర్గం:
జిష్ణు భట్టాచార్జీ, నిరవ్ షాల సినిమాటోగ్రఫీ ‘రణబాలి’కి ప్రాణం పోసింది. పీరియాడిక్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అజయ్ – అతుల్ అందించిన పాటలు బాగున్నాయి కానీ.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) మన తెలుగు నేటివిటీకి, ఎమోషన్‌కు కొన్నిచోట్ల సరిగ్గా సింక్ అవ్వలేదనిపిస్తుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ సెకండాఫ్‌లో కాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ (+):
- విజయ్ దేవరకొండ పవర్ఫుల్ నటన, లుక్
- ఎమోషనల్ అండ్ హిస్టారికల్ ప్లాట్
- విజయ్ – రష్మిక కెమిస్ట్రీ
- సినిమాటోగ్రఫీ, ఇంటర్వెల్ బ్లాక్
మైనస్ పాయింట్స్ (-):
- సెకండాఫ్‌లో కొన్ని రొటీన్, స్లో సీన్స్
- ఎక్కువైన రన్ టైమ్
- పూర్తిగా కనెక్ట్ కాని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
సినీ దావత్ ఫైనల్ తీర్పు:
కమర్షియల్ హిస్టారికల్ డ్రామాగా వచ్చిన ‘రణబాలి’ ఒక సిన్సియర్ అటెంప్ట్. కరువు కష్టాలు, ఆకలి కేకల నేపథ్యాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని స్లో సీన్స్, పాత సినిమాల ఛాయలను పక్కన పెడితే.. విజయ్ దేవరకొండ ఆవేశం, రష్మిక నటన కోసం ఈ ‘రణబాలి’ని థియేటర్లలో కచ్చితంగా చూడాల్సిందే!
మరి మీరు చూసారా మూవీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి
