“బిగ్ బాస్ ఒక అగ్ని పరీక్ష.. నెగిటివ్ కామెంట్స్ తట్టుకోలేకపోతే రావద్దు”: నవదీప్ సంచలన వ్యాఖ్యలు!
తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్’ (Bigg Boss) గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. కంటెస్టెంట్స్ ఆటతీరుపై, వారి ప్రవర్తనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తుంటారు. తాజాగా ఈ షో గురించి, అందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎదుర్కొనే నెగిటివ్ కామెంట్స్ గురించి టాలీవుడ్ నటుడు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ నవదీప్ (Navdeep) తన కారులో ప్రయాణిస్తూ చేసిన ఒక ఆసక్తికరమైన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సమాజానికి అదొక స్మాల్ స్కేల్ మోడల్: నవదీప్ తన వీడియోలో మాట్లాడుతూ.. “యావత్ తెలుగు ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా.. బిగ్ బాస్ అనేది సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే ఒక స్మాల్ స్కేల్ మోడల్. రకరకాల మైండ్ సెట్స్, ఆటిట్యూడ్స్, ఆలోచనలు ఉన్న మనుషుల మధ్య 100 రోజులు బతుకుతున్నప్పుడు ఎవడెవడో ఏదేదో అంటారు. ఆ మాటల్ని మనం ఎలా తీసుకుంటాం? ఎలా రియాక్ట్ అవుతాం? మనల్ని మనం ఎలా కండక్ట్ చేసుకుంటాం అనేదే అసలు పాయింట్. దాని టెస్టే ఈ అగ్ని పరీక్ష” అని బిగ్ బాస్ షో గురించి తనదైన శైలిలో వివరించాడు.
నెగిటివ్ కామెంట్స్ తట్టుకోగలరా? కంటెస్టెంట్స్‌ను విమర్శిస్తూ ఇంటర్నెట్‌లో వచ్చే నెగిటివ్ కామెంట్స్‌పై స్పందిస్తూ.. “ఎవడో కామెంట్ పెట్టినప్పుడు నేను ఏదో అంటాను. దానికి కంటెస్టెంట్ రియాక్షన్ ఎలాగైనా ఉండొచ్చు. పర్సనల్‌గా తీసుకోవచ్చు, లేదా నీ ఒపీనియన్ నీది నా పని నేను చేసుకుంటాను అనొచ్చు, లేదా అసలు నువ్వెవడ్రా నన్ను జడ్జ్ చేయడానికి అని కూడా అనొచ్చు. డిఫరెంట్ పీపుల్ విల్ హావ్ డిఫరెంట్ అప్రోచెస్ అండ్ రియాక్షన్స్” అని నవదీప్ తెలిపాడు.
భరించలేకపోతే అస్సలు రావద్దు! కంటెస్టెంట్స్ ఎమోషన్స్‌ను ట్రిగ్గర్ చేసి వాళ్ళను టెస్ట్ చేయడమే ఈ షో కాన్సెప్ట్ అని చెప్పిన నవదీప్.. నెగిటివ్ కామెంట్స్ తట్టుకోలేని వాళ్ళకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.
“బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళకు ఏం మెసేజ్ ఇస్తారంటే.. నాలాంటోళ్లు ఎంతమంది ఏం మాట్లాడినా తట్టుకుని, నిన్ను నువ్వు నమ్మి నవ్వుతూ నడిచే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా? లేకపోతే బ్రేక్ అయిపోయి ఏడ్చుకుంటూ వెళ్లిపోతావా? ఇదే అగ్ని పరీక్ష. నెగిటివ్ కామెంట్స్ హ్యాండిల్ చేయలేకపోతే ఇంటర్నెట్‌కి రావద్దు.. అగ్ని పరీక్షకు అస్సలు రావద్దు. ఎందుకంటే ఇక్కడ హీట్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది (Heat will only increase)” అంటూ తన వీడియోను ముగించాడు.
బిగ్ బాస్ షోలో జరిగే ఎమోషనల్ డ్రామాను, బయట ఆడియన్స్ రియాక్షన్స్‌ను ఉద్దేశించి నవదీప్ చేసిన ఈ ప్రాక్టికల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
దీని పై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపం లో మాతో పంచుకోండి.
