వైజాగ్‌లో ‘AAA సినిమాస్’ గ్రాండ్ లాంచ్.. అట్టహాసంగా ప్రారంభించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్!
సాగర తీరం వైజాగ్‌లో సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మొదలైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మరియు ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా భాగస్వామ్యం వహిస్తున్న ప్రతిష్టాత్మక ‘AAA సినిమాస్’ (Asian Allu Arjun Cinemas) వైజాగ్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. నగరంలోని సినీ ప్రియులకు ఒక ఐకానిక్ డెస్టినేషన్‌గా నిలవనున్న ఈ మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ స్వయంగా ప్రారంభించారు.

వైజాగ్ సినిమా హిస్టరీలో కొత్త అధ్యాయం: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఇప్పటికే AAA సినిమాస్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే వరల్డ్ క్లాస్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను, లగ్జరీ ఫెసిలిటీస్‌ను వైజాగ్ ప్రేక్షకులకు అందించేందుకు ఈ థియేటర్‌ను సిద్ధం చేశారు. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌తో వైజాగ్ సినిమాటిక్ ల్యాండ్‌స్కేప్‌లో ఒక కొత్త అధ్యాయం మొదలైందని చెప్పొచ్చు.

ఫోటోలో ఈ లాంచ్ ఈవెంట్ ఎంత వైభవంగా జరిగిందో చూడొచ్చు. ఈ వేడుకలో బ్లాక్ సూట్లో స్టైలిష్‌గా మెరిసిన అల్లు అర్జున్.. ‘ఐకాన్ స్టార్ లాంజ్’ (Icon Star Lounge) వేదికపై తన భాగస్వాములు, ప్రముఖులతో కలిసి సందడి చేశారు. ఆద్యంతం ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమం వైజాగ్ అభిమానుల్లో సరికొత్త జోష్ నింపింది.
స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ప్రొజెక్షన్, బెస్ట్ ఇన్ క్లాస్ సౌండ్ సిస్టమ్, మరియు అల్ట్రా ప్రీమియం సీటింగ్‌తో వైజాగ్ ‘AAA సినిమాస్’ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని ఒక హోల్ న్యూ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతోంది.
వైజాగ్ అభిమానులు ఎంత మంది ఎదురుచూస్తున్నారు కామెంట్ కింద చేయండి..
