“పక్కలో పడుకుంటేనే ఆఫర్లు.. టాలెంట్ తో ఏ అమ్మాయీ ఎదగలేదు”: ఇండస్ట్రీపై ఇన్స్టా ఫేమ్ యువతి సంచలన వ్యాఖ్యలు!
ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ ద్వారా ఫేమస్ అయిన టాలెంటెడ్ అమ్మాయిలకు సినిమా, సీరియల్ అవకాశాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆ అవకాశాల వెనుక ఉన్న చీకటి కోణాన్ని బయటపెడుతూ.. ఇన్స్టా రీల్స్ తో పాపులర్ అయిన ఒక యువతి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాయి. రాత్రి 9:30 గంటల సమయంలో హైదరాబాద్ బస్ స్టాప్ లో తన ఊరికి తిరుగు ప్రయాణం అవుతూ ఆమె చేసిన ఈ వీడియో ఇండస్ట్రీలో ‘క్యాస్టింగ్ కౌచ్’ (Casting Couch) పై పెద్ద దుమారమే రేపుతోంది.
“కమిట్మెంట్ లేనిదే అవకాశాలు ఇవ్వరు.. నమ్మి రావొద్దు!” తనకు జరిగిన చేదు అనుభవాన్ని వివరిస్తూ ఆమె మాట్లాడుతూ.. “మన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూసి సినిమాల్లో, సీరియల్స్ లో, ఫోక్ సాంగ్స్ లో అవకాశాలు ఇస్తామంటే గుడ్డిగా నమ్మి నా లాగా ఎగిరి గంతేసుకుంటూ మాత్రం రాకండి. ఎందుకంటే ‘కమిట్మెంట్’ లేనిదే ఏ ఒక్క మగాడు కూడా ఆడదానికి అవకాశం ఇవ్వడు అనేది నాకు పక్కాగా ప్రూవ్ అయ్యింది” అని ఆవేదన వ్యక్తం చేసింది.
వరుసగా మూడోసారి మోసం: తనకు ఇలా జరగడం ఇది మొదటిసారి కాదని, మూడోసారి అని ఆమె చెప్పింది. మొదట సీరియల్ అవకాశం అంటే వెళ్తే అక్కడా కమిట్మెంట్ అడిగారని రిటర్న్ వచ్చేశానని.. ఆ తర్వాత సినిమా అవకాశం వస్తే అక్కడా అదే రిపీట్ అయ్యిందని, ఇప్పుడు కనీసం ఒక కవర్ సాంగ్ (ఫోక్ సాంగ్) అయినా చేద్దామని వస్తే.. ఉదయం నుంచి కూర్చోబెట్టి చివరకు అతను కూడా మగాడి బుద్ధి చూపించాడని ఆమె మండిపడింది.
హీరోయిన్లపై సంచలన కామెంట్స్: “సినిమా ఫీల్డ్ లో అమ్మాయిలకు 110% అవకాశాలు ఉన్నాయి.. కానీ అవి పక్కలో పడుకుంటేనే ఇచ్చే సిట్యువేషన్ లో ఉన్నాయి. నా దృష్టిలో ఏ ఒక్క అమ్మాయి కూడా టాలెంట్ తో ఎదగలేదు అని నేను పక్కాగా నమ్ముతున్నాను. ఇండస్ట్రీలో సెటిల్ అయిన ప్రతి అమ్మాయి కచ్చితంగా ఎవరో ఒకరికి లొంగిపోయి, పడుకుంటేనే పైకి వచ్చింది” అంటూ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు, ఆర్టిస్టులపై ఆమె తీవ్రమైన జనరలైజ్డ్ ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించి నెగటివ్ కామెంట్స్ వచ్చినా తాను పట్టిచుకోనని, వాస్తవం ఇదేనని కుండబద్దలు కొట్టింది.
చచ్చినా ఇక ఇండస్ట్రీకి రాను: “నా ఊర్లో నేను ఉంటూ, నా షాప్ నేను చూసుకుంటూ, నా ఇంట్లో నేను రీల్స్ చేసుకుంటాను కానీ.. చచ్చినా ఇక ఈ సినీ ఫీల్డ్ జోలికి వెళ్లను. ఇక్కడ అవకాశాల పేరుతో ప్రతి ఒక్కడు ఆడదాన్ని వాడుకోవాలనే చూస్తున్నాడు” అంటూ ఆమె హైదరాబాద్ వదిలి తన ఊరికి పయనమైంది. ప్రస్తుతం ఈ యువతి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
ఈ ఇష్యూ పైన మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి.
