Reviews

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ: టాలీవుడ్‌కి కొత్త మాస్ హీరో దొరికేశాడు!

నటీనటులు: జై కృష్ణ, రాషా తడానీ, మోహన్ బాబు తదితరులు

దర్శకత్వం: అజయ్ భూపతి

సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్

సినీ దావత్ రేటింగ్: 2.5/5

యాక్షన్, ఫ్యాక్షన్, ఎమోషన్.. ఈ మూడింటికి సరైన మోతాదులో ప్రేమను జోడించి పక్కా కమర్షియల్ మీల్స్‌లాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మాస్ డైరెక్టర్ అజయ్ భూపతి. ఘట్టమనేని వారసుడు జై కృష్ణను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన కమర్షియల్ యాక్షన్ డ్రామా ‘శ్రీనివాస మంగాపురం’. మరి థియేటర్లలో మాస్ జాతర సృష్టిస్తున్న ఈ సినిమా పాజిటివ్ అంశాలేంటో ఇప్పుడు చూద్దాం..

కథా నేపథ్యం:

తిరుపతి ప్రాంతంలో గట్టి పట్టున్న పెద్దిరెడ్డి కుటుంబానికి, బళ్లారి ప్రాంతాన్ని శాసించే వెంకటప్ప నాయుడు కుటుంబానికి మధ్య జరిగే ఆధిపత్య పోరు ఈ సినిమాకు మూల స్తంభం. రెండు భిన్నమైన నేపథ్యాలున్న బలమైన కుటుంబాల మధ్య శత్రుత్వం, అందులో చిగురించిన ఓ అందమైన ప్రేమ కథ.. ఈ రెండింటి చుట్టూ దర్శకుడు అల్లిన యాక్షన్ డ్రామానే ‘శ్రీనివాస మంగాపురం’.

నటీనటుల పర్ఫార్మెన్స్:

తొలి సినిమానే అయినా జై కృష్ణ తన యాక్టింగ్‌తో ఎక్కడా ఆ తడబాటు కనిపించనివ్వలేదు. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, ఇరగదీసే మాస్ బాడీ లాంగ్వేజ్, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీతో టాలీవుడ్‌కి తానొక పర్ఫెక్ట్ మాస్ మెటీరియల్ అని నిరూపించుకున్నాడు. ఇక హీరోయిన్ రాషా తడానీ తన గ్లామర్‌తో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది.

సినిమాకు మరో మేజర్ హైలైట్ కలెక్షన్ కింగ్, సీనియర్ నటుడు మోహన్ బాబు పాత్ర. సెకండాఫ్‌లో ఆయన ఎంట్రీ ఇవ్వగానే సినిమా గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది. తనదైన మార్క్ నటనతో, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఆయన సినిమాకు భారీతనాన్ని తీసుకొచ్చారు.

విశ్లేషణ:

తన బ్రాండ్ మాస్ టేకింగ్‌ను అజయ్ భూపతి మరోసారి ఈ సినిమాలో చూపించాడు. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయం, కథా నేపథ్యాన్ని చాలా నీట్‌గా ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రేక్షకులను కథలోకి తీసుకువెళ్లాడు. ఇక సెకండాఫ్‌లో అయితే యాక్షన్ మరియు ఎమోషనల్ ఎపిసోడ్స్‌తో సినిమాను పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సీన్స్ మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయి.

సాంకేతికంగా కూడా సినిమా చాలా రిచ్‌గా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) యాక్షన్ సీన్స్‌ను వేరే లెవెల్‌కి ఎలివేట్ చేసింది. విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి, నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడలేదని స్క్రీన్ మీద స్పష్టంగా తెలుస్తోంది.

ఫైనల్ తీర్పు:

కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్లను ఇష్టపడే వారికి ‘శ్రీనివాస మంగాపురం’ ఒక పండుగ లాంటి సినిమా. ఎమోషన్స్, అదిరిపోయే యాక్షన్, మోహన్ బాబు గంభీరమైన నటన, జై కృష్ణ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఈ సినిమాను థియేటర్లలో మిస్ కాకుండా చూడొచ్చు. ఇది పక్కా మాస్ పైసా వసూల్ ఎంటర్‌టైనర్! మరి మీరు చూశారా మీకు ఎలా అనిపంచింది కింద కామెంట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *