Movie News

లార్డ్స్ బాల్కనీలో ‘దాదా’ ఐకానిక్ మూమెంట్: గంగూలీ బయోపిక్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. గూస్‌బంప్స్ ఖాయం!

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత ఇండియన్ క్రికెట్ హిస్టరీలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీ లిఖించుకున్న అగ్రెసివ్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly). ఇప్పుడీ లెజెండరీ క్రికెటర్ జీవితకథ వెండితెరపైకి రాబోతోంది. ఆ నిరీక్షణకు తెరదించుతూ, గంగూలీ బయోపిక్ ‘దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ (Dada – The Sourav Ganguly Story) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు.

రోమాలు నిక్కబొడిచే ఐకానిక్ జెర్సీ మూమెంట్! మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే ప్రతి క్రికెట్ అభిమానికి గూస్‌బంప్స్ రావడం ఖాయం. 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత, లార్డ్స్ బాల్కనీలో గంగూలీ తన జెర్సీని విప్పి గాల్లో తిప్పిన ఆ ఎపిక్ ఘట్టాన్ని ఈ పోస్టర్‌లో అద్భుతంగా రీక్రియేట్ చేశారు. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ రాజ్‌కుమార్ రావ్ (Rajkummar Rao) అచ్చం దాదాలానే ఒదిగిపోయి తన లుక్‌తో ఆశ్చర్యపరిచాడు. ఈ పోస్టర్‌పై ఉన్న “అతను కేవలం ఆట ఆడలేదు… ఆటనే మార్చేశాడు” అనే క్యాప్షన్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తోంది.

భారీ క్రూ.. బ్లాక్‌బస్టర్ కాంబినేషన్! ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌కు విలక్షణ దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే (Vikramaditya Motwane) దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ (T-Series), DBL సంస్థల సమర్పణలో లవ్ ఫిల్మ్స్ (Luv Films) బ్యానర్‌పై లవ్ రంజన్, అంకుర్ గార్గ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

బాక్సాఫీస్ టార్గెట్ 2027: ఈ చిత్రాన్ని ఎక్స్‌టెండెడ్ హాలిడే వీకెండ్ సందర్భంగా 14 మే 2027 (14th May 2027) న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. క్రికెట్ ఎమోషన్స్‌తో రాబోతున్న ఈ పక్కా కమర్షియల్ బయోపిక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

మరి క్రికెట్ అభిమానులు గా దాదా ఫస్ట్ లుక్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *