రికార్డుల రారాజుగా రామ్ చరణ్.. 400 కోట్ల క్లబ్‌లోకి దర్జాగా ఎంట్రీ!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ‘పెద్ది’ (Peddi) పహిల్వాన్‌గా బాక్సాఫీస్ బరిలో దిగి సృష్టిస్తున్న సునామీ ఇప్పట్లో ఆగేలా లేదు. ఎలాంటి అంచనాలతో థియేటర్లలోకి వచ్చిందో, అంతకు మించిన వసూళ్లతో బాక్సాఫీస్ రికార్డులను ఊచకోత కోస్తోంది ఈ రూరల్ యాక్షన్ డ్రామా.
రీసెంట్‌గా “2026 సౌత్ ఇండియా నంబర్ 1 గ్రాసర్” గా నిలిచిన ఈ సినిమా, ఇప్పుడు మరో భారీ ఎపిక్ మైలురాయిని దర్జాగా చేరుకుంది. మేకర్స్ అధికారికంగా విడుదల చేసిన లేటెస్ట్ ‘విక్టరీ ప్రోమో’ పోస్టర్ ప్రకారం.. ‘పెద్ది’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 400 కోట్ల గ్రాస్ (400 CR+ Gross Worldwide) వసూలు చేసి బాక్సాఫీస్ రారాజుగా నిలిచింది.
ఊరమాస్ సెలబ్రేషన్స్.. జనం భుజాలపై చరణ్! మేకర్స్ రిలీజ్ చేసిన 400 కోట్ల పోస్టర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది. రామ్ చరణ్ మెడలో భారీ పూలమాల, మెడలో పతకం వేసుకుని.. సంతోషంతో ఉప్పొంగిపోతున్న జనం భుజాల మీద ఎక్కిన ఆ విజిల్-వర్తీ మూమెంట్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. థియేటర్ల దగ్గర ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ చేసుకుంటున్న సంబరాలకు, సినిమా సాధించిన ఈ గ్రాండ్ సక్సెస్‌కు ఈ పోస్టర్ పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్ అని చెప్పాలి.
చరణ్ సోలో స్టామినాకిదే ప్రూఫ్! రిలీజ్ రోజున మిక్స్‌డ్ టాక్‌తో మొదలైన ఒక సినిమా, కేవలం తన కంటెంట్ అండ్ హీరో మాస్ ఇమేజ్‌తో ఏకంగా 400 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు దర్శకుడు బుచ్చిబాబు సానా చూపించిన ఎమోషనల్ టేకింగ్ కూడా బి, సి సెంటర్ల (B & C Centers) ఆడియన్స్‌కు బలంగా కనెక్ట్ అయింది. నాన్-రాజమౌళి ప్రాజెక్ట్‌తో రామ్ చరణ్ కొట్టిన ఈ బాక్సాఫీస్ దెబ్బ.. ఆయన పాన్-ఇండియా సోలో స్టామినాకు అతిపెద్ద నిదర్శనం.
బయ్యర్లను సేఫ్ జోన్‌లోకి తీసుకొచ్చి లాభాల బాట పట్టిస్తున్న ఈ ‘పెద్ది’ పహిల్వాన్.. ఫుల్ రన్ ముగిసేలోపు హాఫ్ బిలియన్ (500 కోట్లు) మార్క్ వైపు ఏమైనా అడుగులు వేస్తాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది!
ఇంకా ఎన్ని కోట్లు వసూల్ చేస్తది అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.
