Movie News

బ్రేకింగ్: ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్.. పవన్ కళ్యాణ్ క్లాప్‌తో ఘనంగా ‘మెగా 158’ లాంచ్!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బాక్సాఫీస్ వద్ద మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యారు. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ బాబీ (Bobby Kolli) తో చిరంజీవి చేస్తున్న 158వ సినిమా (Mega 158) గురువారం (మే 21) హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే ఈ లాంచ్ ఈవెంట్‌కు ఒక స్పెషల్ అట్రాక్షన్ తోడైంది, అదే ‘మెగా బ్రదర్స్’ అంతా ఒకే కారులో, ఒకే వేదికపైకి రావడం!

క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్.. కనువిందుగా మెగా ఫ్రేమ్! ఈ ఓపెనింగ్ సెర్మనీకి పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మరియు నాగబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిరంజీవి, పవన్, నాగబాబు ఒకే కారులో ఈవెంట్ కు రావడం అభిమానులకు కనువిందు చేసింది. ముహూర్తపు సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా.. చిరంజీవి కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రస్తుతం ఈ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

‘వాల్తేరు వీరయ్య’ను మించేలా ఊరమాస్ ప్లానింగ్! ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ (KVN Productions) పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ను మించేలా యాక్షన్, డ్రామా, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో డైరెక్టర్ బాబీ ఈ కథను సిద్ధం చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ (Thaman) ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు.

కత్తిలాంటి టైటిల్.. క్రేజీ క్యాస్టింగ్: ఈ సినిమాలో చిరు రెండు భిన్నమైన వేరియేషన్స్ ఉన్న పవర్‌ఫుల్ మాస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కోసం చిరంజీవి కఠినమైన జిమ్ వర్కౌట్స్ చేసి ఫిజిక్ మార్చిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇక ఈ చిత్రానికి ‘కాకాజీ’ (Kakaji) అనే పవర్‌ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్. హీరోయిన్‌గా నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి నటిస్తుండగా, మలయాళ బ్యూటీ అనశ్వర రాజన్ (Anaswara Rajan) చిరంజీవి కూతురి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఈ నెలాఖరు నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. దేవి శ్రీ ప్రసాద్ నుంచి థమన్ కు షిఫ్ట్ అయిన బాబీ, మెగాస్టార్‌కు ఎలాంటి ఊరమాస్ ఆల్బమ్ ఇస్తాడో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని దించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ మూవీ కోసం మీరు కూడా ఎదురు చూస్తున్నారా అయితే కామెంట్ చేయండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *