త్రిష, ఛార్మిల కష్టాలు.. ఆన్లైన్లో బుక్ కాలేదట!
సమ్మర్ వచ్చేసింది.. షూటింగులు, ప్రొడక్షన్ పనులకు కాస్త బ్రేక్ ఇచ్చి ఎక్కడికైనా వెకేషన్‌కి వెళ్లాలని టాలీవుడ్ సెలబ్రిటీలు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఆ ట్రిప్ ప్లాన్ చేసుకోవడం ఎంత కష్టమో త్రిష, ఛార్మిలను చూస్తే అర్థమవుతుంది. తాజాగా త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో త్రిష.. తన బెస్ట్ ఫ్రెండ్, నిర్మాత ఛార్మి కౌర్ మరియు మరో స్నేహితురాలితో కలిసి సమ్మర్ వెకేషన్ ఎక్కడికి వెళ్లాలి అని ప్లాన్ చేయడానికి కూర్చుంది. ఆన్లైన్లో ఊర్లన్నీ వెతికి వెతికి వాళ్ల బుర్రలు హీటెక్కిపోయాయి. వీడియోలో ఛార్మి, త్రిషల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే ట్రిప్ ప్లానింగ్ వాళ్ళని ఎంత కన్ఫ్యూజ్ చేసిందో అర్థమవుతుంది. “గంటసేపట్లో ఆన్లైన్లో ప్రపంచమంతా చుట్టేశాం.. కానీ ఇంకా ఆ సమ్మర్ వెకేషన్ ఎక్కడికనేది బుక్ చేసుకోలేదు” అంటూ త్రిష పెట్టిన క్యాప్షన్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం త్రిష వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’, కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ లాంటి భారీ చిత్రాల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అటు ఛార్మి కూడా పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంటోంది. ఈ హెక్టిక్ షెడ్యూల్స్ మధ్య కాస్త రిలాక్స్ అయ్యేందుకు ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇలా సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే వీళ్లు ఏ డెస్టినేషన్ ఫైనల్ చేస్తారో చూడాలి!దీని పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం లో పంచుకోండి.
