సినిమాను తలపించే రియల్ స్టోరీ.. భార్య ప్రేమ కోసం 26 ఏళ్లు ఎదురు చూశాడు.. క్లైమాక్స్ ట్విస్ట్ తెలిస్తే మైండ్ బ్లాక్!
సాధారణంగా సినిమాల్లో హీరో తన భార్యను లేదా ప్రేమికురాలిని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడం చూస్తుంటాం. కత్తులు, తుపాకులతో విలన్ల వేట సాగుతుంది. కానీ, రియల్ లైఫ్‌లో ఒక భర్త తన భార్యను కిరాతకంగా చంపిన హంతకుడిని పట్టుకోవడానికి ఏకంగా 26 ఏళ్ల పాటు ఒక నిశ్శబ్ద యుద్ధం చేశాడు. కోర్టుల చుట్టూ తిరగలేదు.. పోలీసుల కాళ్లు పట్టుకోలేదు. కేవలం తన భార్య చనిపోయిన ఆ గదికి 26 ఏళ్ల పాటు లక్షల్లో అద్దె కట్టాడు. ఎందుకో తెలుసా? ఆ కారణం, ఈ కథలోని క్లైమాక్స్ ట్విస్ట్ వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.
1999లో జరిగిన ఆ ఘోరం..
ఈ స్టోరీ 1999లో మొదలైంది. సతోరు తకోబా (Satoru Takaba), నమికో (Namiko) ఇద్దరూ భార్యాభర్తలు. వాళ్లకు రెండేళ్ల వయసున్న ఒక బాబు ఉన్నాడు. వాళ్ళది చాలా సంతోషకరమైన చిన్న కుటుంబం. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో వాళ్ల జీవితాల్లో ఒక పెను విషాదం చోటుచేసుకుంది. విహార యాత్రకు వెళ్లారు అక్కడే హోటల్ తీసుకున్నారు ఒకరోజు భర్త తకోబా, తన రెండేళ్ల బాబుని తీసుకుని బయటకు వెళ్లాడు. భార్య నమికో మాత్రమే గదిలో ఉంది. భర్త తిరిగొచ్చి చూసేసరికి.. గదిలో తన భార్య రక్తపు మడుగులో ప్రాణాలు వదిలి పడి ఉంది. ఆ సీన్ చూసి ఆ భర్త గుండె ముక్కలైంది.
దొరకని సాక్ష్యాలు.. ఆగిపోయిన కేసు!
పోలీసులు వచ్చారు, ఎంక్వయిరీ చేశారు. గదిలో భార్య రక్తంతో పాటు, హంతకుడి రక్తం కూడా కొన్ని చోట్ల పడి ఉంది. అలాగే వాళ్ళు తిన్న ఫుడ్ మరకలు కూడా దొరికాయి. అయితే ఇది జరిగింది 1999లో. అప్పట్లో నేరస్థులను పట్టుకోవడానికి ఉపయోగించే DNA టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందలేదు. ఆ దొరికిన కొద్దిపాటి రక్తం ఎవరిదో పోలీసులు కనిపెట్టలేకపోయారు. దీంతో కేసు ముందుకు సాగలేదు, హంతకుడు ఎస్కేప్ అయ్యాడు.
భార్య కోసం భర్త చేసిన 26 ఏళ్ల పోరాటం..
పోలీసులు చేతులెత్తేసినా ఆ భర్త మాత్రం ఆశ వదులుకోలేదు. ఇక్కడే అతను ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య చనిపోయిన ఆ హోటల్ గదిని ఎవరూ క్లీన్ చేయకూడదని.. ఆ బెడ్ షీట్స్, రక్తం మరకలు, ఆ వస్తువులు అలాగే ఉండాలని.. ఆ గదిని తనకే అద్దెకు ఇవ్వాలని ఓనర్ ని కోరాడు. “భవిష్యత్తులో టెక్నాలజీ కచ్చితంగా పెరుగుతుంది.. అప్పుడు ఈ గదిలో ఉన్న సాక్ష్యాలతో హంతకుడిని పట్టుకుంటాను” అని ఆ గదిని లాక్ చేశాడు.

అలా ఒక సంవత్సరం కాదు, పదేళ్లు కాదు.. ఏకంగా 26 ఏళ్ల పాటు ఆ ఖాళీ గదికి ప్రతి నెలా అద్దె కడుతూనే ఉన్నాడు. అలా అద్దె కోసం అతను ఖర్చు పెట్టిన అమౌంట్ అక్షరాలా 22 మిలియన్ యెన్లు (సుమారు 1.45 లక్షల డాలర్లు).. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు కోటీ 30 లక్షల రూపాయలు! భార్య మీద ప్రేమతో తను వేరే పెళ్లి కూడా చేసుకోకుండా కొడుకుతో ఒంటరిగా ఉండిపోయాడు.
టెక్నాలజీతో దొరికిన హంతకురాలు.. మైండ్ బ్లాక్ అయ్యే నిజం!
ఆ భర్త నమ్మకమే గెలిచింది. ఇప్పుడు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), ఆధునిక DNA టెక్నాలజీ చాలా డెవలప్ అయ్యాయి. 26 ఏళ్ల క్రితం ఆ గదిలో జాగ్రత్తగా దాచిన రక్తాన్ని ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేశారు. ఫైనల్ గా హంతకురాలు దొరికింది. ఆమె పేరు ‘యాసుకో (Yasuko)’. ఈమె మరెవరో కాదు.. చనిపోయిన నమికో భర్త తకోబాతో కలిసి చదువుకున్న పాత క్లాస్ మేట్.

అసలు ఎందుకు చంపింది?
చిన్నప్పటి నుండి యాసుకో కి తకోబా అంటే పిచ్చి ప్రేమ. కానీ తకోబా మాత్రం నమికోని పెళ్లి చేసుకున్నాడు. ఆ కోపంతో, ఈర్ష్యతో రగిలిపోయిన యాసుకో.. తకోబా బయటకు వెళ్లిన టైమ్ చూసి పక్కా ప్లాన్ తో అతని భార్యను దారుణంగా చంపేసింది. భార్య చనిపోతే, తకోబా ఒంటరివాడై తన దగ్గరికి వస్తాడని, తనని పెళ్లి చేసుకుంటాడని ఆమె ప్లాన్. ఆ ప్లాన్ లో భాగంగానే పదే పదే అతని దగ్గరికి వెళ్లడానికి ట్రై చేసింది. కానీ తకోబా తన భార్య జ్ఞాపకాలతో, ఆమెపై ఉన్న ప్రేమతో 26 ఏళ్లు ఒంటరిగానే ఉండిపోయాడు. ఫైనల్ గా ఇప్పుడు టెక్నాలజీ సాయంతో ఆ సైకో కిల్లర్ జైలు ఊచలు లెక్కిస్తోంది.
ఒకవేళ ఆ భర్త ఆ గదిని వదిలేసి ఉంటే.. సాక్ష్యాలు చెరిగిపోయి ఉండేవి, ఆ హంతకురాలు ఎప్పటికీ దొరికేది కాదు. భార్యపై అతను చూపించిన ఈ అంతులేని ప్రేమ, ఓపిక గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్‌లో పంచుకోండి.
