తెలంగాణ ‘గద్దర్’ అవార్డ్స్ 2025 విజేతల జాబితా: ఉత్తమ నటుడు నాగ చైతన్య, నటి రష్మిక! పూర్తి వివరాలు ఇవే..
టాలీవుడ్ సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ‘నంది అవార్డుల’ స్థానంలో, తెలంగాణ ప్రభుత్వం ప్రజా గాయకుడు గద్దర్ గారి సార్ధక నామధేయంతో ‘గద్దర్ అవార్డులు’ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 2025 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల జాబితాను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది యువసామ్రాట్ నాగ చైతన్య, నేషనల్ క్రష్ రష్మిక మందన్న తమ అద్భుతమైన నటనతో సత్తా చాటారు.
ఉత్తమ చిత్రాలు, నటీనటులు వీరే..: పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ కంటెంట్ ఉన్న సినిమాలకే అవార్డుల పంట పండింది. సాయిలు దర్శకత్వంలో వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఉత్తమ చిత్రంగా ఎంపికై, పలు విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టింది. ఇక శ్రీకాకుళం మత్స్యకారుల నేపథ్యంలో వచ్చిన ‘తండేల్’ సినిమాకు గాను అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) ఉత్తమ నటుడిగా నిలవగా.. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలోని తన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కు గాను రష్మిక మందన్న (Rashmika Mandanna) ఉత్తమ నటిగా అవార్డును దక్కించుకున్నారు.
తెలంగాణ గద్దర్ అవార్డులు 2025 – పూర్తి విజేతల జాబితా ఇక్కడే చూసేయండి:
- ఉత్తమ చిత్రం: రాజు వెడ్స్ రాంబాయి
- ఉత్తమ నటుడు: నాగ చైతన్య (తండేల్)
- ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)
- ఉత్తమ దర్శకుడు: సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
- ఉత్తమ ద్వితీయ చిత్రం: దండోరా
- ఉత్తమ తృతీయ చిత్రం: ది ప్రీ వెడ్డింగ్ షో
- నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా: తండేల్
- ఉత్తమ పర్యావరణ చిత్రం: ఇగ్వా
- ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్: లిటిల్ హార్డ్స్
- ఉత్తమ వినోదాత్మక చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం
- ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం: కోర్టు
- ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ: మిరాయ్
- ఉత్తమ బాలల చిత్రం: అనగనగనా
నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు:
- ఉత్తమ సపోర్టింగ్ నటుడు: శివాజీ
- ఉత్తమ సపోర్టింగ్ నటి: భూమిక
- ఉత్తమ హాస్యనటుడు: కృష్ణ తేజ (జిగ్రీస్)
- ఉత్తమ బాలనటుడు: రోహన్ రాయ్ (ప్రీ వెడ్డింగ్ షో)
- ఉత్తమ సంగీత దర్శకుడు: మార్క్ కె రాబిన్ (దండోరా)
- ఉత్తమ నేపథ్య గాయకుడు: అనురాగ్ (రాజు వెడ్స్ రాంబాయి)
- ఉత్తమ నేపథ్య గాయని: సాహితి చాగంటి (కన్నప్ప)
- ఉత్తమ కథా రచయిత: గుణశేఖర్ (యుఫోరియా)
- ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్: అనిల్ రావిపూడి
- ఉత్తమ గేయ రచయిత: నందకిశోర్ (కుబేర)
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్: కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
- ఉత్తమ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
- ఉత్తమ ఆడియోగ్రాఫర్: ఎం.ఆర్ రాధాకృష్ణన్ (కిష్కిందపురి)
- ఉత్తమ కొరియోగ్రాఫర్: గిర గిర గిర (సాంగ్)
- ఉత్తమ ఆర్ట్ డైరక్టర్: తోట తరణి (ఛాంపియన్)
- ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: గోవింద్ (అఖండ)
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: చంద్రకాంత్ (చాంపియన్)
స్పెషల్ జ్యూరీ అవార్డులు:
- ఉత్తమ స్పెషల్ జ్యూరీ ఫిల్మ్: 23
- ఉత్తమ మేల్ యాక్టర్ (జ్యూరీ): చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
- ఉత్తమ నటి (జ్యూరీ): అనంతిక (8 వసంతాలు)
- స్పెషల్ జ్యూరీ హీరో: రోషన్ (చాంపియన్)
అద్భుతమైన ప్రతిభ కనబరిచి గద్దర్ అవార్డులు సొంతం చేసుకున్న విజేతలందరికీ సినీ దావత్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు! ఈ అవార్డుల జాబితా పట్ల మీ అభిప్రాయం ఏంటి? మీ ఫేవరెట్ హీరో/హీరోయిన్ కు అవార్డు వచ్చిందా? కింద కామెంట్స్ లో మాతో పంచుకోండి.
