Movie News

ప్రభాస్ డబుల్ ధమాకా.. ఒకేసారి ‘కల్కి 2’, ‘స్పిరిట్’ షూటింగ్! హీరోయిన్ గా ‘యానిమల్’ బ్యూటీ ఫిక్స్?

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) లైనప్ చూస్తుంటే ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక సినిమా సెట్స్ పైన ఉండగానే మరో రెండు సినిమాలను లైన్లో పెడుతూ డార్లింగ్ ఫ్యాన్స్ కి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫిబ్రవరి నెలలో ప్రభాస్ ఏకంగా రెండు భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్టుల షూటింగ్స్ లో ఏకకాలంలో పాల్గొంటున్నారు.

ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్స్: సాధారణంగా ఒక పెద్ద సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే హీరోలు మరో సినిమా మొదలుపెడతారు. కానీ ప్రభాస్ మాత్రం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సెన్సేషనల్ సీక్వెల్ ‘కల్కి 2’ (Kalki 2898 AD Part 2) మెయిన్ షూటింగ్ లో పాల్గొంటూనే.. మరోవైపు క్రియేటివ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’ (Spirit) షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యారు. ఈ రెండు సినిమాల వర్కింగ్ స్టైల్స్, గెటప్స్ పూర్తిగా భిన్నంగా ఉన్నప్పటికీ డార్లింగ్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు.

దీపికా ఔట్.. తృప్తి దిమ్రి ఇన్? (Spirit Heroine): ఇక ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక భారీ రూమర్ వైరల్ అయిన విషయం తెలిసిందే ఈ సినిమాలో ముందుగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ను అనుకున్నారు. కానీ ఆమె స్థానంలో ‘యానిమల్’ సినిమాతో నేషనల్ క్రష్ గా మారిన బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి (Tripti Dimri) హీరోయిన్ గా ఫిక్స్ అయిన చేసిన విషయం తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా కాంపౌండ్ నుంచి వచ్చిన ‘యానిమల్’ లో ఆమె నటనకు మంచి మార్కులు పడటంతో, ప్రభాస్ సరసన ఆమెను ఫైనల్ చేశారని టాక్

ఫ్యాన్స్ కి పండగే: ఒకవైపు భైరవగా ‘కల్కి 2’ లో అదరగొట్టడానికి, మరోవైపు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ‘స్పిరిట్’ లో విశ్వరూపం చూపించడానికి ప్రభాస్ రెడీ అవుతున్నారు. ఈ వార్తలతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. మరి తృప్తి దిమ్రి ఎంట్రీ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

ఇలా ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ లో పాల్గొనడం తన అభిమానులకు పండగే ఇక దీని పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం లో మాతో పంచుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *