Movie News

అలుపు లేని రెబల్ స్టార్: ఫిబ్రవరిలో ఒకేసారి రెండు భారీ చిత్రాల షూటింగ్.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ప్రభాస్ లైనప్!

హైదరాబాద్ (Cine Dawat Exclusive): పాన్- ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బాహుబలి’తో భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన డార్లింగ్, ఇప్పుడు వరుస పెట్టి భారీ బడ్జెట్ సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ఇప్పటికే ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) సినిమాతో 1000 కోట్ల క్లబ్ లో చేరిన ప్రభాస్, తన తదుపరి చిత్రాల విషయంలో వేగం పెంచారు. తాజా సమాచారం ప్రకారం, ప్రభాస్ అభిమానులకు ఈ ఫిబ్రవరి నెల ఒక పండగలా మారబోతోంది.

ఒకేసారి రెండు పడవల ప్రయాణం! సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పుడు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రభాస్ ఈ ఫిబ్రవరి నెలలో ఏకంగా రెండు భారీ క్రేజీ ప్రాజెక్టుల షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. అందులో ఒకటి నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ వండర్ ‘కల్కి 2898 AD – పార్ట్ 2’ కాగా, మరొకటి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్పిరిట్’ (Spirit).

మొదలవ్వబోతున్న ‘స్పిరిట్’ విధ్వంసం ‘యానిమల్’ (Animal) సినిమాతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్‌తో చేయబోయే ‘స్పిరిట్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో ప్రభాస్ ఒక సిన్సియర్ మరియు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని టాక్. సందీప్ వంగా మార్క్ టేకింగ్, ప్రభాస్ కటౌట్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

‘కల్కి 2’ లోకి మళ్ళీ ఎంట్రీ మరోవైపు, 2024లో అతిపెద్ద హిట్ గా నిలిచిన ‘కల్కి 2898 AD’కి సీక్వెల్ పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. మొదటి భాగం క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్‌లు, కర్ణుడిగా ప్రభాస్ విశ్వరూపం చూసిన తర్వాత, రెండో భాగం ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి, షూటింగ్ కోసం రంగం సిద్ధం చేశారు. ప్రభాస్ ఫిబ్రవరిలోనే ‘కల్కి 2’ సెట్స్‌లో కూడా అడుగుపెట్టబోతున్నారు. కొన్ని రోజులు ‘స్పిరిట్’ సెట్స్‌లో, మరికొన్ని రోజులు ‘కల్కి 2’ సెట్స్‌లో పాల్గొంటూ ప్రభాస్ బిజీ బిజీగా గడపనున్నారు.

అభిమానుల ఆనందం – ఇండస్ట్రీలో చర్చ ఒకే సమయంలో రెండు వేల కోట్ల బడ్జెట్ సినిమాలను బ్యాలెన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ ప్రభాస్ తన కమిట్‌మెంట్‌తో నిర్మాతలకు, దర్శకులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా డేట్స్ సర్దుబాటు చేస్తున్నారు. ఈ వార్త తెలియడంతో సోషల్ మీడియాలో రెబల్ స్టార్ ఫ్యాన్స్ రచ్చ మొదలుపెట్టారు. #Prabhas, #Spirit, #Kalki2 హ్యాష్‌ట్యాగ్స్ ట్విట్టర్ (X)లో ట్రెండ్ అవుతున్నాయి.
అలాగే ఈ రెండు సినిమాల పార్ట్-2 ల తర్వాత సలార్ పార్ట్ – 2 కూడా స్టార్ట్ కాబోతుంది సో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి లో ఉన్నారు అన్న మాట ఇక రాబోయే రోజుల్లో ప్రభాస్ నుండి రాబోయే అప్డేట్స్ కోసం మన ‘సినీ దావత్’ (Cine Dawat) వెబ్‌సైట్‌ను ఫాలో అవుతూ ఉండండి.అలాగే దీని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం లో పంచుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *