సంక్రాంతి 2026 ఫైనల్ రిపోర్ట్: బాక్సాఫీస్ బాద్షా మెగాస్టారే.. రవితేజ, శర్వానంద్ లెక్కలు ఇవే!
సంక్రాంతి 2026 బాక్సాఫీస్ యుద్ధం ముగిసింది. ఈ ఏడాది సంక్రాంతికి ఐదు పెద్ద సినిమాలు పోటీ పడినా, విజేతగా మాత్రం మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. అయితే రవితేజ, శర్వానంద్‌లు కూడా గట్టి పోటీ ఇచ్చారు. పూర్తి కలెక్షన్స్ వివరాలు ఇవే..
- మెగాస్టార్ అగ్రస్థానం: చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఫైనల్ రన్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 358 కోట్ల గ్రాస్ (Gross) వసూలు చేసి, సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.
- ప్రభాస్ ‘రాజా సాబ్’ జోరు: రెబల్ స్టార్ ప్రభాస్ హారర్ కామెడీ ‘ది రాజా సాబ్’ (The Raja Saab) మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా దాదాపు రూ. 230 కోట్లు రాబట్టి కమర్షియల్ ఎంటర్టైనర్గా సత్తా చాటింది.
- రవితేజ మాస్ జాతర: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (BMW) చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. కిషోర్ తిరుమల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా, సైలెంట్‌గా రూ. 20 కోట్లు కొల్లగొట్టి రవితేజ కెరీర్లో ఓ మోస్తరు హిట్‌గా నిలిచింది.
- శర్వానంద్ హ్యాట్రిక్: మళ్ళీ సంక్రాంతికి తన మార్క్ చూపించాడు శర్వానంద్. రామ్ అబ్బరాజు డైరెక్షన్లో వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీతో నవ్వించి రూ. 90 కోట్ల క్లబ్లో చేరి 100 కోట్ల క్లబ్ లోకి వెళ్లడం సులువే. దీంతో శర్వానంద్ ఖాతాలో మరో సంక్రాంతి బ్లాక్ బస్టర్ పడింది.
- సైలెంట్ హిట్ ‘అనగనగా ఒక రాజు’: ఎవరూ ఊహించని విధంగా నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం రూ. 100 కోట్ల మైలురాయిని అందుకొని అందరికీ షాక్ ఇచ్చింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది.
మొత్తానికి 2026 సంక్రాంతి టాలీవుడ్‌కి కాసుల వర్షం కురిపించింది. బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్ అని చిరు మరోసారి నిరూపించారు!
మరి మీరు ఇందులో ఏ మూవీ చూసారు అనేది కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.
