Collections

బాక్సాఫీస్ వద్ద ‘మెగా’ విధ్వంసం.. 358 కోట్లు కొల్లగొట్టిన చిరు!

బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయాలన్నా.. వాటిని చెరిపేయాలన్నా అది ఒక్క మెగాస్టార్‌కే సాధ్యం అని మరోసారి రుజువైంది. సంక్రాంతి కానుకగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 358 కోట్ల గ్రాస్ (Gross) వసూళ్లను దాటేసింది. కేవలం రెండు వారాల్లోనే ఈ మార్క్ అందుకోవడం చిరు స్టామినాకు నిదర్శనం. నైజాం, సీడెడ్, ఆంధ్రా అనే తేడా లేకుండా అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.
యూఎస్ (USA) బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. మాస్ ఆడియెన్స్‌తో పాటు క్లాస్ ఆడియెన్స్ కూడా సినిమాకు క్యూ కడుతున్నారు.
ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య’తో రికార్డులు బద్దలు కొట్టిన చిరంజీవి, ఇప్పుడు ఈ సినిమాతో తన సొంత రికార్డులను తానే బ్రేక్ చేసుకుంటున్నారు. లాంగ్ రన్‌లో ఈ సినిమా 400 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది…
దీని మీ అభిప్రాయాలను కామెంట్ రూపం లో రాయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *