Viral News

బ్రేకింగ్: సింగిల్ స్క్రీన్స్‌లో ‘టికెట్ ట్రాకింగ్’ ఏదీ? ఎగ్జిబిటర్ల డిమాండ్లపై ఫైర్ అయిన నాగవంశీ, మైత్రీ రవి!

టాలీవుడ్‌లో ఇప్పుడు ‘అద్దె (Rental) వర్సెస్ పర్సంటేజ్ (Percentage)’ వివాదం తారాస్థాయికి చేరుకుంది. సింగిల్ స్క్రీన్స్ కు పర్సంటేజ్ విధానం అమలు చేయాల్సిందే అని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు డెడ్‌లైన్లు పెడుతున్న తరుణంలో.. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ రంగంలోకి దిగింది. ఇందాక జరిగిన ప్రెస్ మీట్‌లో ప్రముఖ నిర్మాతలు నాగవంశీ, మైత్రీ రవిశంకర్ తదితరులు పాల్గొని థియేటర్ ఓనర్ల డిమాండ్లపై ఘాటుగా స్పందించారు.

‘పెద్ది’ రిలీజ్ టైమ్‌లో ఈ రచ్చ ఏంటి? – నాగవంశీ ప్రస్తుతం ఇండస్ట్రీ ఆదాయం లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉందని స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఆవేదన వ్యక్తం చేశారు. “సంక్రాంతి తర్వాత ఆడియన్స్ థియేటర్లకు రావడం బాగా తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో రామ్ చరణ్ లాంటి భారీ పాన్-ఇండియా సినిమా ‘పెద్ది’ (Peddi) రిలీజ్ కు రెడీ అవుతుంటే, ఇప్పుడు ఈ గొడవలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇండస్ట్రీలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు.. ఎవరికి కష్టం వచ్చినా ముగ్గురూ నష్టపోతారు” అని ఆయన అన్నారు. థియేటర్ లో నష్టాలు ఉంటే ఎందుకు నడిపిస్తున్నారు అన్నారు. అలాగే సునీల్ నారంగ్‌కి కౌంటర్ ఇస్తూ.. “మల్టీప్లెక్స్ కల్చర్ వల్లే ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ దెబ్బతింటున్నాయి” అని కుండబద్దలు కొట్టారు.

సంక్రాంతికి ఎందుకు సైలెంట్ అయ్యారు? – మైత్రీ రవిశంకర్ మైత్రీ రవిశంకర్ నేరుగా ఎగ్జిబిటర్లను ప్రశ్నించారు. “సంక్రాంతికి వరుసగా పెద్ద సినిమాలు వచ్చినప్పుడు, థియేటర్ల దగ్గర డబ్బులు వచ్చినప్పుడు ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు సైలెంట్ గా ఉండి.. ఇప్పుడు సడెన్ గా పర్సంటేజ్ ఇవ్వాలి అని డిమాండ్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్?” అని ఆయన సూటిగా నిలదీశారు.

‘టికెట్ ట్రాకింగ్’ పెడితేనే పర్సంటేజ్! ఇక నిర్మాతలు లేవనెత్తిన అతిపెద్ద పాయింట్ “పారదర్శకత” (Transparency). సింగిల్ స్క్రీన్స్‌లో ఎన్ని టికెట్లు తెగుతున్నాయి అని చెప్పడానికి కచ్చితమైన కంప్యూటరైజ్డ్ ‘టికెట్ ట్రాకింగ్ సిస్టమ్’ లేదని వారు మండిపడ్డారు. “షోలు హౌస్‌ఫుల్ అవుతున్నా కూడా, కొన్ని థియేటర్లు కేవలం సగం టికెట్లే అమ్ముడయ్యాయని లెక్కలు చూపిస్తున్నాయి. కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న మేము.. సరైన అకౌంటబిలిటీ (Accountability) లేకుండా ఎలా సర్వైవ్ అవుతాం? ముందు సింగిల్ స్క్రీన్స్‌లో పర్ఫెక్ట్ టికెట్ ట్రాకింగ్ సిస్టమ్ తీసుకురండి, అప్పుడే పర్సంటేజ్ సిస్టమ్ గురించి ఆలోచిస్తాం” అని గిల్డ్ తేల్చి చెప్పింది.

అంతేకాకుండా, మల్టీప్లెక్స్‌ల తరహాలో సింగిల్ స్క్రీన్స్‌లో కూడా ఫ్యామిలీలకు, ముఖ్యంగా సెకండ్ షోలకు వచ్చే మహిళలకు భద్రత, మంచి క్యాంటీన్, వాష్ రూమ్ సదుపాయాలు (Infrastructure) కల్పించాలని మైత్రీ రవిశంకర్ డిమాండ్ చేశారు. డెడ్‌లైన్లు, బెదిరింపులతో కాకుండా అందరూ కూర్చుని మాట్లాడుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నిర్మాతలు స్పష్టం చేశారు. ఏదేమైనా.. నిర్మాతలు ‘టికెట్ ట్రాకింగ్’ అనే వజ్రాయుధాన్ని ప్రయోగించడంతో బంతి ఇప్పుడు మళ్లీ ఎగ్జిబిటర్ల కోర్టులోకి వెళ్లింది!

ఇందులో ఎవరి ఒపీనియన్ కరెక్ట్ అంటారు కామెంట్స్ లో మాతో పంచుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *