Movie News

టైటిల్స్‌పై ఇంగ్లీష్ మోజు.. ‘పాన్ ఇండియా’ పిచ్చితో అచ్చమైన తెలుగు పేర్లు కనుమరుగవుతున్నాయా?

ఒకప్పుడు తెలుగు సినిమా టైటిల్స్ వింటేనే కథేంటో అర్థమైపోయేది. ‘మాయాబజార్’, ‘గీతాంజలి’, ‘శివ’, ‘ఖుషి’, ‘అతడు’.. ఇలా అచ్చమైన తెలుగు పదాలతో, లేదా పవర్‌ఫుల్ పేర్లతో టైటిల్స్ పెట్టేవారు. కానీ ఇప్పుడు ‘పాన్ ఇండియా’ (Pan-India) మార్కెట్ మొదలైన తర్వాత, మన టాలీవుడ్ సినిమాల పోస్టర్ల మీద అచ్చమైన తెలుగు పేర్లు దాదాపుగా కనుమరుగవుతున్నాయి. ఎటు చూసినా ఇంగ్లీష్ పేర్లు, లేదా అన్ని భాషలకూ సరిపోయే యూనివర్సల్ పేర్లే దర్శనమిస్తున్నాయి.

కారణం ఆ ‘యూనివర్సల్ అప్పీల్’ కోసమే! రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, ప్రభాస్ ‘స్పిరిట్’, పవన్ కళ్యాణ్ ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్), ఎన్టీఆర్ ‘వార్ 2’, యశ్ ‘టాక్సిక్’.. ఇలా భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఇంగ్లీష్ టైటిల్స్ తోనే వస్తున్నాయి. ఒకవేళ తెలుగు పదం పెడితే హిందీలో, లేదా తమిళంలో దాన్ని మార్చాల్సి వస్తుంది. అలా మార్చినప్పుడు ఒరిజినల్ టైటిల్ కి ఉండే బజ్ పక్క భాషల్లో ఉండదు. అందుకే అన్ని భాషల్లోనూ ఒకే టైటిల్ ఉంటే ప్రమోషన్స్ చేయడం సులువు అవుతుందని, బ్రాండింగ్ కూడా బాగుంటుందని మేకర్స్ ఈ ఇంగ్లీష్ పేర్ల వైపు మొగ్గుచూపుతున్నారు.

మన భాషకు నష్టమా? బిజినెస్ పరంగా చూసుకుంటే ఇది బెస్ట్ స్ట్రాటజీనే. కానీ, ‘బాహుబలి’ (Baahubali), ‘పుష్ప’ (Pushpa) లాంటి పేర్లు ఏ భాషలోనూ మార్చకుండానే వందల కోట్లు కొల్లగొట్టాయి కదా! కథలో దమ్ముంటే టైటిల్ ఏ భాషలో ఉన్నా ప్రేక్షకులు ఆదరిస్తారు. కేవలం యూనివర్సల్ అప్పీల్ కోసం, ఇంగ్లీష్ పేర్ల మోజులో పడి మన మాతృభాషలోని అందమైన పదాలను వెండితెరకు దూరం చేయడం బాధాకరం అని భాషాభిమానులు, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరి మీరేమంటారు టైటల్స్ ఎలా ఉంటే బాగుంటది అంటారు కామెంట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *