బ్రేకింగ్: కలెక్షన్లన్నీ ఫేక్.. రూపాయి ఆదాయం పావలాకి పడిపోయింది! శిరీష్ ఇష్యూలో బన్నీ వాసు సంచలన ట్వీట్!
నిర్మాత శిరీష్ వ్యాఖ్యలతో రాజుకున్న ‘టికెట్ రేట్లు – సింగిల్ స్క్రీన్ పర్సంటేజ్’ వివాదం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎవరికి వారు వాదించుకుంటున్న ఈ తరుణంలో మెగా నిర్మాత బన్నీ వాసు (Bunny Vas) సోషల్ మీడియా (X) వేదికగా ఎంటర్ అయ్యారు. ఎగ్జిబిటర్లు, నిర్మాతలు అసలు సమస్యను వదిలేసి, లేని ఆదాయం కోసం కొట్టుకుంటున్నారంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. బన్నీ వాసు చెప్పిన పచ్చి నిజాలు ఏంటంటే..
కలెక్షన్లన్నీ మాయజాలమే.. సగటు ప్రేక్షకుడు రావడం లేదు! ఈరోజు సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయని పోస్టర్లు వేసుకుని సంబరపడుతున్నాం కానీ.. అది ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చిన వసూళ్లు కావని బన్నీ వాసు కుండబద్దలు కొట్టారు. “కేవలం టికెట్ రేట్లు, ఇతర ధరలు పెంచడం వల్లే ఆ కలెక్షన్లు కనిపిస్తున్నాయి. సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు రావడం తగ్గిపోయింది. వచ్చే కొద్దిమంది ప్రేక్షకుల మీదే అధిక భారం వేసి వసూళ్లు పెంచుకుని, దాన్నే భారీ కలెక్షన్లు అని చెప్పుకోవడం కన్నా పెద్ద తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదు” అని ఆయన ఘాటుగా విమర్శించారు.
పావలా కోసం కొట్టుకుంటున్నారు! ఇండస్ట్రీలో రూపాయి ఆదాయం అందరికీ పోయిందని, పెద్ద సినిమాల ఆదాయం అర్ధరూపాయికి, చిన్న సినిమాల ఆదాయం పావలాకు పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు ఇద్దరూ నష్టపోతున్నారని అంగీకరించిన ఆయన.. “అసలు మన రూపాయి ఆదాయం ఎందుకు పోయిందో మర్చిపోయి.. ఆ మిగిలిన పావలాలో ఎవరు ఎంత తీసుకోవాలి అని మనం కొట్టుకుంటున్నాం” అంటూ ఇరు వర్గాలకు చురకలు అంటించారు.
టాలీవుడ్ పతనానికి బన్నీ వాసు చెప్పిన 4 మూలకారణాలు: ఇలా ఆదాయం పడిపోయి, థియేటర్లకు జనాలు రాకపోవడానికి ప్రధానంగా 4 కారణాలు ఉన్నాయని బన్నీ వాసు విశ్లేషించారు.
- స్టార్ హీరోల వాయిదాలు: తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడంలో హీరోల ప్రభావం చాలా ఎక్కువ. అలాంటి హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మాత్రమే చేస్తే, ప్రేక్షకుడికి సినిమాలపై ఆసక్తి క్రమంగా తగ్గిపోతుంది.
- 27 రోజుల ఓటీటీ రూల్: సినిమాలను కేవలం 27 రోజుల్లోనే ఓటీటీ (OTT) లో విడుదల చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు.
- కంటెంట్ లోపం: “ఇంత ఖర్చు పెట్టి థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరమా?” అని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా కంటెంట్ వీక్ గా ఉండటం.
- క్యాంటీన్ దోపిడీ: మల్టీప్లెక్సుల్లో క్యాంటీన్ ధరలు (స్నాక్స్, పాప్ కార్న్) సామాన్యుడికి అందుబాటులో లేకపోవడం.
ఈ నాలుగు కారణాల్లో కంటెంట్ తప్ప, మిగతా మూడు ఇండస్ట్రీ పెద్దల చేతుల్లోనే ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ మూల సమస్యలను సరిచేయకుండా, ఉన్న ఆ పావలా ఆదాయం కోసం కొట్టుకోవడం వల్ల ఇండస్ట్రీలో ఎవరికీ లాభం చేకూరదని బన్నీ వాసు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. బన్నీ వాసు లాంటి ఒక యాక్టివ్ ప్రొడ్యూసర్ నేరుగా స్టార్ హీరోల మేకింగ్ స్పీడ్ ను, ఫేక్ కలెక్షన్ల ట్రెండ్ ను టార్గెట్ చేస్తూ చేసిన ఈ కామెంట్స్ పై మిగతా ఇండస్ట్రీ వర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.మరి దీని పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో పంచుకోండి.
