‘మిడ్-రేంజ్’ సినిమాలు మాయం: టాలీవుడ్లో మిగిలింది ఆ రెండు వర్గాలేనా?
ఒకప్పుడు టాలీవుడ్లో బడ్జెట్ పరంగా మూడు రకాల సినిమాలు ఉండేవి. చిన్న బడ్జెట్ (రూ. 5 కోట్లు), మిడ్-రేంజ్ లేదా టైర్-2 బడ్జెట్ (రూ. 30 – 50 కోట్లు), మరియు భారీ బడ్జెట్ (రూ. 100 కోట్లు పైన). కానీ ఇప్పుడు ఆ ‘మిడ్-రేంజ్’ అనేది టాలీవుడ్ బాక్సాఫీస్ నుంచి పూర్తిగా కనుమరుగవుతోంది.
అటు వంద కోట్లు.. ఇటు ఐదు కోట్లు! ప్రస్తుతం ఇండస్ట్రీ రెండు ఎక్స్ట్రీమ్స్కి వెళ్లిపోయింది. ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ లాంటి స్టార్ల సినిమాలు రూ. 300 కోట్ల పైనే బడ్జెట్ అవుతున్నాయి. ఇవి పాన్ ఇండియా స్థాయిలో ఆడుతున్నాయి. మరోవైపు ‘బలగం’, ‘కమిటీ కుర్రోళ్లు’, ‘ఆయ్’ లాంటి సినిమాలు కేవలం రూ. 5 – 10 కోట్లతో తెరకెక్కి బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. కానీ ఈ మధ్యలో ఉండే మన టైర్-2 హీరోల (నాని, రవితేజ, రామ్, నితిన్ లాంటి వారి) సినిమాలు రూ. 40 కోట్లు ఖర్చు పెట్టి తీస్తే, కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అవ్వడం లేదు.
కారణం ఏంటి? కంటెంట్ బలంగా లేకపోవడం, కేవలం రొటీన్ ఫార్ములాను నమ్ముకోవడమే దీనికి ప్రధాన కారణం. ప్రేక్షకులు భారీ విజువల్స్ ఉన్న పాన్ ఇండియా సినిమాలకు థియేటర్‌కు వస్తున్నారు. లేదా స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్న చిన్న సినిమాలను ఆదరిస్తున్నారు. రొటీన్ గా ఉండే మిడ్-రేంజ్ సినిమాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అందుకే నిర్మాతలు ఇప్పుడు మిడ్-రేంజ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు.
ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే మీడియం బడ్జెట్ సినిమాలు రావడం ఇక కష్టమే అన్న మాట.. మరి మీరు ఎలా చూస్తారు ఈ సమస్య ని కామెంట్స్ లో మాతో పంచుకోండి.
