బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష’ ఫేక్.. వాళ్లకి ముందే ప్లాన్ ఉంది: ఉప్పల్ బాలు సంచలన ఆరోపణలు!
సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఉప్పల్ బాలు (Uppal Balu).. తాజాగా బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష’ సెలక్షన్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. తనను పిలిచి ఎలాంటి టాస్కులు ఇవ్వకుండానే ఎలిమినేట్ చేశారని, ఇదంతా వాళ్ళు ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం జరిగిందని ఆరోపిస్తూ అతను రిలీజ్ చేసిన వీడియో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
అవమానించారని ఆవేదన: బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లాలని ఎన్నో ఆశలతో అగ్ని పరీక్షకు వెళ్లిన ఉప్పల్ బాలుకి చేదు అనుభవం ఎదురైంది. కేవలం మూడు రోజుల్లోనే తనను వెనక్కి పంపించేశారని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం ఒక టాస్క్ గానీ, గేమ్ గానీ ఇవ్వకుండా.. అసలు ఒక ప్రశ్న కూడా అడగకుండా తనను తాను నిరూపించుకునే అవకాశం ఇవ్వకపోవడం తనను అవమానించడమే అని బాలు అన్నాడు.
ముందే ఫిక్స్ అయ్యారా? సెలక్షన్స్ ప్రక్రియపై ఉప్పల్ బాలు సంచలన ఆరోపణలు చేశాడు. “ఎంతమందిని తీసుకోవాలి, ఎవరిని ఎలిమినేట్ చేయాలి అనేది వాళ్లకు ముందే ఒక ప్లాన్ ఉంది. 70 మంది కంటెస్టెంట్స్ వస్తే.. కనీసం మైక్ పట్టుకుని మాట్లాడటం రాని వాళ్ళను, నాకన్నా తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళను తీసుకున్నారు” అని మేకర్స్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వారం వారం కంటెంట్ ఇచ్చే సత్తా ఉన్న తనను కాదని, తెలివి లేని వాళ్ళను తీసుకోవడం ఏంటని ప్రశ్నించాడు.
ఫైనల్‌గా బాలు చెప్పిందేంటంటే.. “అక్కడ ఏం జరుగుతుందో, మేము వెళ్లి ఏం అనుభవించామో మాకే తెలుసు. ఫైనల్‌గా బిగ్ బాస్‌కి వెళ్లినా, అగ్ని పరీక్షకు వెళ్లినా.. వాళ్ళు ఎలిమినేట్ చేస్తే సైలెంట్‌గా ఇంటికి రావాల్సిందే. ఎవరైనా ఇంతే” అంటూ ఉప్పల్ బాలు తన వీడియోను ముగించాడు.
ప్రస్తుతం ఉప్పల్ బాలు చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. కొందరు నెటిజన్లు బాలుకి సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు బిగ్ బాస్ ఫార్మాట్ అంతే ఉంటుంది కదా అని కామెంట్స్ చేస్తున్నారు.
దీని పై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపం లో మాతో పంచుకోండి..
